Breaking News

గుడ్ లక్ సఖీ సినిమా టీజర్ విడుదల చేసిన ప్రభాస్


మహానటి సినిమాతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ . తాజాగా మరొక లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ తో మన ముందుకు వస్తోంది. గుడ్ లక్ సఖి అంటూ కీర్తి మరో చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ తాజాగా విడుదల అయ్యింది. సోషల్ మీడియా వేదికగా ప్రముఖ యంగ్ రెబల్ స్టార్ గుడ్ లక్ సఖీ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15 , ఉదయం పది గంటలకు టీజర్ ను విడుదల చేశారు. Read More: ఈ సినిమా కోసం ఎక్కువగా మహిళలే పని పనిచేస్తున్నారని సమాచారం శ్రావ్య వర్మ సహ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా, తమిళ్, మలయాళ భాషల్లో విడుదలకానుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో గుడ్ లక్ సఖీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం లో కీర్తి సురేష్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తున్నట్లు తాజాగా విడుదల చేసిన పోస్టర్ ద్వారా తెలుస్తోంది. కీర్తి సురేష్‌తో పాటు ఇతర ప్రధాన పాత్రల్లో ఆది పినిశెట్టి, జగపతి బాబు కనిపించనున్నారు. కీర్తి సురేష్ షూటర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. `మ‌హాన‌టి` సినిమాతో కీర్తి సురేష్ కెరీర్ మారిపోయింది. న‌టిగా 66వ జాతీయ పుర‌స్కారాల్లో ఉత్త‌మ న‌టి అవార్డుని ద‌క్కించుకుని మ‌రింత గుర్తింపుని, స్టార్ డ‌మ్ నీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ భామ నితిన్‌తో కలిసి రంగ్‌దే సినిమాలో నటిస్తోంది. అటు మహేష్ హీరోగా వస్తున్న సర్కార్ వారి పాటలో కూడా కిర్తి సురేష్ యాక్ట్ చేస్తోంది. . త‌మిళంలో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీ న‌టిస్తున్న `అన్నాత్తే` లో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది.ఇటీవలే కీర్తి నటించిన పెంగ్విన్ సినిమా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే.


By August 15, 2020 at 11:00AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rebelstar-prabhas-released-good-luck-sakhi-teaser/articleshow/77558693.cms

No comments