Breaking News

నిర్మాతగా మారబోతున్న స్టార్ హీరోయిన్..?


హీరోయిన్ల కెరీర్ చాలా కొద్ది కాలమే ఉంటుంది. ఏళ్లకి ఏళ్ళు హీరోయిన్ గా కొనసాగడం కష్టమే. ఎవరో ఒకరిద్దరు తప్ప సంవత్సరాల కొద్దీ హీరోయిన్ గా బండి లాక్కెళ్ళడం అందరి వల్లా కాదు. అదీ స్టార్ హీరోయిన్ గా కొనసాగడం ఇంకా కష్టం. కానీ సమంత మాత్రం అలా కాదు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన సమంత వరుస విజయాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

పెళ్ళి చేసుకున్న తర్వాత నటనా ప్రాధాన్యమున్న చిత్రాల్లోనే నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంది. అయితే జాను తర్వాత సమంత తెలుగు సినిమాలేవీ ఒప్పుకోలేదు. జాను బాక్సాఫీసు వద్ద అంతగా ప్రభావం చూపలేకపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తమిళ సినిమాలున్నాయి. తెలుగు సినిమాలు మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. తాజా సమాచారం ప్రకారం సమంత నిర్మాతగా మారబోతుందని తెలుస్తుంది.

హీరోయిన్ గా సినిమాలు మానేసి పూర్తిగా నిర్మాణ పనులనే చూసుకోనుందని వినబడుతుంది. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న టైమ్ లోనే నిర్మాతగా అరంగేట్రంచేయాలని ఆశిస్తోందట. ఆ తర్వాత పూర్త్స్థాయి నిర్మాతగానే కొనసాగాలని డిసైడ్ అయిందని అంటున్నారు. ఈ విషయమై మరికొద్ది రోజుల్లో అధికారిక సమాచారం వెల్లడి చేస్తారట. చూడాలి మరేం జరగనుందో..!



By August 01, 2020 at 08:07PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/52057/samantha.html

No comments