Breaking News

యువకులకు ఆంటీ వలపు వల.. పెళ్లి పేరుతో రూ.లక్షలు దోచుకుంటూ


మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ల ద్వారా అమాయక యువకులను ట్రాప్ చేసి దోచుకుంటున్న ఇద్దరిని కర్ణాటకలోని పోలీసులు అరెస్ట్ చేశారు. చిక్కబళ్లాపురకు చెందిన లక్ష్మీ (32), కోలార్‌కు చెందిన శివణ్ణ కలిసి మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్ల ద్వారా అనేక మందిని మోసగించినట్లు పోలీసులు తెలిపారు. లక్ష్మీ ఆన్‌లైన్‌ మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్లలో తాను అనాథ అని, పిన్ని ఇంట్లో ఉంటున్నట్లు ప్రొఫైల్ క్రియేట్ చేసింది. Also Read: దాన్ని చూసిన హాసన్ ప్రాంతానికి చెందిన పరమేశ్ అనే యువకుడు గతేడాది డిసెంబర్‌లో లక్ష్మీని సంప్రదించాడు. తాను పెళ్లి చేసుకుంటానని పరమేశ్‌ చెప్పడంతో లక్ష్మీ అతడితో పరిచయం పెంచుకుంది. ఇద్దరూ ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకుని తరుచూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలోనే తన అవసరాల కోసమంటూ లక్ష్మి అతడి నుంచి రూ.6లక్షల వరకు తీసుకుంది. తర్వాతి నుంచి పరమేశ్‌ను దూరం పెట్టసాగింది. Also Read: దీంతో అతడు నిలదీయగా ‘నన్ను రేప్ చేశావని పోలీసులకు ఫిర్యాదు చేస్తా’నంటూ బెదిరించింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు హాసన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో ఆమెకు శివణ్ణ అనే వ్యక్తి సాయం చేసినట్లు గుర్తించి ఇద్దరిని ఆదివారం అరెస్ట్ చేశారు. వీరిద్దరు గతంలోనూ అనేక మంది యువకులకు మ్యాట్రిమోని వెబ్‌సైట్ల ద్వారా ట్రాప్‌ చేసి డబ్బులు దోచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. Also Read:


By August 17, 2020 at 07:41AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/karnataka-honey-trap-hassan-police-arrests-two-cheaters-including-woman/articleshow/77582389.cms

No comments