గుంటూరు: ఏడాదిన్నర బాలికపై వృద్ధుడి అఘాయిత్యం

నగరంలో దారుణం జరిగింది. ఏడాదిన్నర బాలికపై ఓ వృద్ధుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై శనివారం దిశ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. గుంటూరు నెహ్రూనగర్ శివారులోని మోతీలాల్‌నగర్‌లో భార్యభర్తలు నివాసముంటున్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవించే వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. శనివారం దంపతులు కూలి పనులకు వెళ్లగా బాలికలిద్దరూ ఇంట్లోనే ఉన్నారు. Also Read: కాసేపటి తర్వాత పెద్ద కుమార్తె బయటికి వెళ్లగా ఇంటి పక్కనే ఉండే బి.రాము (55) ఇంట్లోకి ప్రవేశించి ఏడాదిన్న వయసున్న బాలికపై అసభ్య చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో ఆ చిన్నారి గట్టిగా ఏడవడంతో బాలిక అక్క ఇంట్లోకి వచ్చింది. కంగారుపడిన రాము ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక విషయం చెప్పగడంతో వారు కొత్తపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సలహాతో దిశ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. Also Read: దీనిపై కేసు నమోదు చేసుకున్న దిశ స్టేషన్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, కొత్తపేట సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్సైలు హరిచందన, ఖాజీబాబులు ఘటనా స్థలికి వెళ్లి ప్రాథమిక విచారణ చేపట్టారు. నిందితుడు రాము కొద్ది నెలల క్రితమే నల్గొండ నుంచి గుంటూరు వచ్చి అద్దెకు ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితుడికి కఠినశిక్ష పడేలా చేస్తామని పోలీసులు తెలిపారు. Also Read:
By August 09, 2020 at 12:20PM
No comments