Breaking News

అయోధ్యలో మందిరం కల సాకరమయ్యింది.. తదుపరి ఏంటి?


అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో కీలక ఘట్టం బుధవారం ముగిసింది. దీంతో అయోధ్యలో ఆలయం నిర్మించాలన్న సంఘ్ పరివార్ కీలక లక్ష్యం నెరవేరింది. జాతీయత, సాంస్కృతిక గుర్తింపు దృక్పథం పెరుగుతున్నదనడానికి ఇది నిదర్శనం అని అభిప్రాయపడింది. అయితే, ప్రధాన లక్ష్యమైన రామాలయ నిర్మాణం నెరవేరడంతో ఆర్ఎస్ఎస్ తదుపరి లక్ష్యం ఏంటనే సందేహం వ్యక్తమవుతోంది. కానీ, దీనిపై ఆర్ఎస్ఎస్ వర్గాలు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నాయి. ఆలయ ఉద్యమం తరువాత ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నం కాదని, రాముడి జన్మస్థలంలో ఆలయం నిర్మాణంతో శ్రీరాముడి విలువలు దేశ సాంస్కృతిక, సామాజిక జీవితానికి ప్రాతినిధ్యం వహిస్తాయని, మరింత మంది అనుసరించేలా ఆకర్షిస్తుందని ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త ఒకరు తెలిపారు. లౌకిక పార్టీలు తొలుత హిందూత్వ వాదనను అంగీకరించలేదని, సుప్రీంకోర్టు ఏకగ్రీవ తీర్పు ద్వారా చివరకు దీనికి ఆమోదం లభించిందన్నారు. ఆలయం విషయంలో కాంగ్రెస్ సహా అనేక ఇతర పార్టీలు ప్రజల ఆకాంక్షలను తెలుసుకోవడంలో విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యూహాం కాదని, రాముడి జన్మస్థానం గురించి ప్రజల్లో బలమైన నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఆర్ఎస్ఎస్ విజయం ఆమోదయోగ్యమైందని, ఈ విషయంలో ఆలయం ఒక శక్తివంతమైన క్షేత్రమవుతుందని పేర్కొన్నారు. కాశీ విశ్వనాథ్-జ్ఞాన్వాపి మసీదుకు ఇదే విధానం అవసరం లేదని తెలిపారు. వ్యాజ్యం కింద ఉన్న వివాదాన్ని పరిష్కరించడానికి రోడ్‌మ్యాప్ అక్కర్లేదని అన్నారు. హిందూత్వ, గుర్తింపు గురించి నమ్మకాలను అంగీకరించడం ప్రధాన సమస్య అని అన్నారు. ఒక నిర్దిష్ట ఆలోచన, విలువ సమాజంలో విస్తరించిన తర్వాత, ఇటువంటి సమస్యలు పరిష్కరించబడతాయన్నారు. ప్రతి సమస్యకు ఇలాంటి పరిష్కారం అవసరం లేదు. యోధ్యలో రామమందిర శంకుస్థాపనకు మోహన్ భగవత్ హాజరుకావడం సంస్థకు వ్యతిరేకంగా చేసిన ప్రచారాలను తిరస్కరించడం అని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది.


By August 06, 2020 at 08:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ram-temple-in-ayodhya-fulfilment-of-a-key-sangh-parivar-goal-what-next/articleshow/77384553.cms

No comments