Breaking News

ఆ చిన్న ఎఫర్ట్‌తో బోలెడన్ని ప్రాణాలు కాపాడొచ్చు.. వైరల్ అవుతున్న నాని గోల్డెన్ వర్డ్స్


ప్రస్తుతం దేశమంతా కరోనా విలయతాండవంలో చిక్కుకుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా మహమ్మారి అదుపులోకి రావడం లేదు. నిత్యం లక్షల్లో కేసులు నమోదవుతుండటంతో జనం వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో జనాల్లో గురించిన అవగాహన పెంపొందేలా గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో కమిషనర్‌ సజ్జనార్‌ ఏర్పాటు చేసిన కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా సెలబ్రిటీల చేత ప్రచారం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా హీరో కోవిడ్‌ నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే లక్షలాది మందికి కోవిడ్‌ వచ్చిందని, వీరిలో చాలా మందికి తగ్గిపోయిందని, కోలుకున్నవారంతా ప్లాస్మాదానం చేయాలని ఆయన కోరారు. కోవిడ్‌ నుంచి కోలుకున్న ఓ వ్యక్తి ఇచ్చే 500 ఎంఎల్‌ ప్లాస్మా ద్వారా ఇద్దరు కోవిడ్‌ బాధితులు కోలుకుంటారని పేర్కొన్నారు. మీరు ఇచ్చిన ప్లాస్మా రెండు మూడు రోజుల్లో తిరిగి శరీరంలో ఫామ్ అవుతుందని చెప్పారు. Also Read: ఇంత చిన్న ఎఫర్ట్ మనకు ఒక బ్యూటిఫుల్‌ ఫీలింగ్, శాటిస్‌ఫ్యాక్షన్ కలిగిస్తుంది. బోలెడన్ని ప్రాణాలు కూడా కాపాడొచ్చు. కాబట్టి కరోనా నుంచి కోలుకున్న అందరూ ముందుకొచ్చి 9490617440 నెంబరుకు ఫోన్‌ చేసి ప్లాస్మా దానం చేయాలని అన్నారు నాని. దీంతో నాని చెప్పిన ఈ గోల్డెన్ వర్డ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నాని సినిమాల విషయానికొస్తే.. ఆయన నటించిన ''మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మోహన‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు కాంబినేష‌న్‌లో క్రేజీ మల్టీస్టారర్ సినిమాగా రూపొందింది. చాలారోజుల క్రితమే షూటింగ్ ఫినిష్ చేసుకొని లాక్‌డౌన్ కారణంగా థియేటర్స్ మూతపడటంతో విడుదల కాలేదు. మరోవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' మూవీ చేస్తున్నారు నాని. ఇటీవలే మారుతి కథ కూడా విన్న నాని.. దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.


By August 04, 2020 at 01:32PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hero-nani-golden-words-on-plasma-donation/articleshow/77346723.cms

No comments