తిరుపతి: ఉద్యోగుల వాట్సాప్ గ్రూప్‌లో సెక్స్ వీడియో కలకలం

నగరంలో సెక్స్ వీడియో కలకలం రేపింది. తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్‌లో పనిచేసే ఉద్యోగులు క్రియేట్ చేసుకున్న వాట్సాప్ గ్రూప్‌లో శుక్రవారం అర్ధరాత్రి వచ్చిన పోర్న్ వీడియోతో పాటు ఆ వెబ్‌సైట్ లింక్‌ను ఓ అధికారి పోస్ట్ చేశారు. కార్పోరేషన్ కమిషనర్, అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌తో సహా ఉన్నతాధికారులందరూ ఉన్న ఆ గ్రూపులో అసభ్య వీడియోలతో కూడిన వెబ్‌సైట్ లింకును చూసి అందరూ షాకయ్యారు. Also Read: శనివారం ఉదయం ఆ లింక్‌ను చూసిన కొందరు వెంటనే తొలగించాలని సదరు అధికారిని హెచ్చరించినా డిలీట్ ఆప్షన్ లేకపోవడంతో గ్రూపులో ఉన్న అధికారులందరూ దాన్ని గమనించి అవాక్కయ్యారు. అయితే సదరు అధికారి పరిధిలో పనిచేసే కొందరు ఉద్యోగులు గ్రూపు సభ్యుల దృష్టి మరల్చాలని వందల సంఖ్యలో ఫొటోలను ఆ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేసి ప్రయత్నించారు. అయితే అప్పటికే ఈ విషయం బయటకు పొక్కడంతో పాటు పలువురు మహిళా ఉద్యోగులు ఈ అంశాన్ని వారి ఇన్‌ఛార్జుల దృష్టికి తీసుకెళ్లారు. Also Read: వాట్సాప్ గ్రూపులో మహిళా ఉద్యోగులతో పాటు ఉన్నతాధికారులు కూడా ఉండడంతో ఈ ఆంశాన్ని తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గిరీష తీవ్రంగా పరిగణించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డిని ఆదేశించారు. సదరు అధికారి వాట్సాప్ గ్రూపులో అసభ్య వీడియోలను పెట్టిన విషయం నిర్ధారణ కావడంతో ఆయన నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారం తిరుపతిలోని అధికారిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
By August 18, 2020 at 08:39AM
No comments