Breaking News

పబ్జీ ఆటకు బానిసై యువకుడి ఆత్మహత్య.. విశాఖలో విషాదం


ప్రమాదకరమైన ఆటకు మరో యువకుడు బలైపోయాడు. బక్రీద్‌ పండగ వేళ కొడుకు బలవన్మరణానికి పాల్పడడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. ఈ ఘటన విశాఖ నగరంలోని ఆరిలోవలో శనివారం జరిగింది. విశాఖ నగర పరిధి ఆరిలోవ బాలాజీనగర్‌ సమీపంలోని రాజీవ్‌నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న మహమ్మద్‌ బేగం భర్త చాలాకాలం క్రితమే మరణించాడు. దీంతో ఆమె కుమార్తె, కొడుకు మహమ్మద్‌ హమీద్‌ (28) కలిసి ఉంటోంది. కూతురికి కొంతకాలం క్రితమే వివాహం చేసింది. పదో తరగతి తర్వాత చదువు మానేసిన హమీద్ స్థానికంగా మొబైల్‌ స్పేర్‌ పార్ట్స్‌ దుకాణంలో పనిచేసేవాడు. Also Read: లాక్‌‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోవడంతో మూడు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఖాళీగా ఉంటుండటంతో ఇటీవల అతడు పబ్జీ గేమ్‌కు బానిసయ్యాడు. దీంతో తల్లి తరుచూ మందలిస్తున్నా హమీద్ ఆమెను పట్టించుకోకుండా నిత్యం ఆ గేమ్‌ ఆడుతూనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే శనివారం కూడా తల్లి అతడిని మందలించింది. మొబైల్ గేమ్స్‌ ఆడటం మానుకుని ఏదైనా పని చూసుకోవాలని సూచించింది. Also Read: దీంతో మనస్తాపానికి గురైన హమీద్ తల్లి కిచెన్‌లో వంట చేస్తున్న సమయంలో గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాసేపటి తర్వాత గదిలోకి వెళ్లిన మహమ్మద్‌ బేగం ఫ్యాన్‌కు వేలాడుతున్న కొడుకుని చూసి షాకైంది. స్థానికుల సాయంతో అతడిని కిందికి దించి చూడగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. భర్త లేకపోయిన కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన తనకు పండగ పూటే దేవుడు అన్యాయం చేశాడంటూ ఆమె రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఆరిలోవ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం హమీద్ మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. Also Read:


By August 02, 2020 at 07:43AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/pubg-addiction-28-year-old-man-kills-himself-after-argument-with-mother-in-vizag/articleshow/77310531.cms

No comments