గిద్దలూరు: పెళ్లి వేడుకలో హిజ్రాల అర్ధనగ్న డ్యాన్సులు.. షాకిచ్చిన పోలీసులు

కరోనా వైరస్ కారణంగా కొద్ది నెలలుగా వివాహ వేడుకలపై ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలోలా ఘనంగా వివాహం చేసుకోవడం, రోడ్లపై ఊరేగింపులా వెళ్లడాన్ని అధికారులు నిషేధించారు. పెళ్లికి 50 మందికి మించి హాజరుకాకూడదని, నిరాడంబరంగా వేడుక నిర్వహించుకోవాలని అనేక నిబంధనలు విధించారు. ఈ కండిషన్లను అతిక్రమించిన అనేక మందిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. తాజాగా గిద్దలూరులో ఈ నిబంధలను అతిక్రమించిన పెళ్లి నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. Also Read: నగర పంచాయతీ పాములపల్లెకి చెందిన ఓ కుటుంబంలోని యువకుడి రెండ్రోజుల క్రితం వివాహమైంది. అయితే వారు పోలీసుల అనుమతి తీసుకోకుండా ఘనంగా వేడుకలు నిర్వహించారు. అంతేకాకుండా రాత్రి వేళ హిజ్రాలతో అర్ధనగ్నంగా నృత్యాలు చేయించారు. దీనిపై సమాచారం అందుకున్న గిద్దలూరు పోలీసులు గ్రామంలో విచారణ చేపట్టారు. Also Read: సీఐ సుధాకరరావు ఆదేశాల మేరకు ఏఎస్సై రంగయ్య వివాహ నిర్వాహకులు, నృత్యాలు చేసిన హిజ్రాలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో అధికారుల అనుమతి తీసుకోకుండా వివాహాలు చేయడం, ఊరేగింపులు చేపట్టడం నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. Also Read:
By August 09, 2020 at 09:32AM
No comments