Breaking News

పెళ్లయిన 2 నెలలకే యువతి ఆత్మహత్య.. చంపేశారంటున్న తల్లిదండ్రులు


పెళ్లయిన రెండు నెలలకే నవ వధువు అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటన హైదరాబాద్‌లో విషాదం నింపింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం హిమాయత్‌నగర్‌ గ్రామానికి చెందిన లక్ష్మి, నరేందర్‌ దంపతుల కుమార్తె నిఖిత అలియాస్‌ సంధ్య (20)కు జూన్‌ 12న లంగర్‌హౌస్‌ బాపూనగర్‌కు చెందిన రమేష్‌తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.15 లక్షల నగదు, బంగారు ఆభరణాలు కట్నంగా ముట్టజెప్పారు. Also Read: రమేష్ కుటుంబం ఉమ్మడిగా కేటరింగ్‌ వ్యాపారం చేస్తోంది. అతడితో పాటు తల్లిదండ్రులు, అన్న, వదిన అందరూ కలిసే ఉంటారు. బుధవారం మధ్యాహ్నం భోజనం చేసిన నిఖిత రెండో అంతస్తులోని తన గదిలోకి ఎంతసేపటికి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడిన కుటుంబసభ్యులు వెళ్లి చూడగా చున్నీతో ఉరేసుకుని కనిపించింది. దీంతో వారు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. Also Read: ఈ ఘటనపై నిఖిత తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లైన తర్వాత కొద్దిరోజులే తమ కూతురు సంతోషంగా ఉందని చెబుతున్నారు. అత్తింట్లో వేధింపులు ఎక్కువ అవుతున్నాయని, బావ(రమేష్ అన్న) పోరు పడలేకపోతున్నానని నిఖిత తమతో చెప్పేదని వారు తెలిపారు. నిఖితను అత్తింటివారే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు Also Read:


By August 20, 2020 at 09:09AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/newly-maried-woman-commits-suicide-in-hyderabad/articleshow/77646907.cms

No comments