Breaking News

కోవిడ్ కేసుల్లో మరో రికార్డ్ దిశగా భారత్.. కేవలం 16 రోజుల్లోనే


కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో భారత్ మరో రికార్డును సాధించింది. దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య మూడు మిలియన్లకు చేరవయ్యింది. ప్రపంచంలో కోవిడ్-19 కేసులు మూడు మిలియన్ల దాటిన మూడో దేశంగా భారత్ నిలవనుంది. ఇప్పటి వరకు అమెరికా, బ్రెజిల్‌లోనే ఇంత పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా 68వేలకుపైగా కొత్త కేసులు నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 29,71,112కి చేరాయి. వరుసగా నాలుగో రోజు 950కిపైగా మరణాలు సంభవించాయి. మొత్తం 958 మంది ప్రాణాలు కోల్పోగా.. దేశంలో కరోనా మరణాల సంఖ్య 55,858కి చేరింది. కేవలం 16 రోజుల్లోనే ఒక్క మిలియన్ల కేసులు నమోదయ్యాయి. దీంతో అత్యంత వేగంగా కేసులు నమోదయిన అమెరికా, బ్రెజిల్‌ను భారత్ అధిగమించింది. పాజిటివ్ కేసులు 2 మిలియన్ల నుంచి 3 మిలియన్లకు చేరడానికి బ్రెజిల్‌లో 23 రోజులు పడితే, అమెరికాలో 28 రోజులు పట్టింది. తొలి మిలియన్ కేసులకు 138 రోజులు పట్టగా.. అప్పటి నుంచి శరవేగంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ఒక్క మిలియన్ నుంచి రెండు మిలియన్ల చేరడానికి 21 రోజులు పట్టగా.. అదే అమెరికాలో 43 రోజులు, బ్రెజిల్‌లో 27 రోజులు పట్టింది. అమెరికా, బ్రెజిల్‌తో పోలిస్తే భారత్‌లో మరణాలు రేటు తక్కువగానే ఉంది. అమెరికాలో 1.4 లక్షలు, బ్రెజిల్‌లో లక్ష మంది కోవిడ్‌తో చనిపోయారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7 లక్షలు దాటింది. 15 రోజుల కిందట ఇది ఆరు లక్షలుగా ఉంది. శుక్రవారం బెంగాల్‌లో (3,245), గుజరాత్ (1,204), మధ్యప్రదేశ్ (1,147) అత్యధిక కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 14వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ పాజిటివ్ కేసులు 6.5 లక్షలకు చేరాయి.


By August 22, 2020 at 07:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indias-coronavirus-cases-set-to-cross-3m-last-million-in-just-16-days/articleshow/77686462.cms

No comments