ఏటీఎం కార్డుతో రూ. 11.94 లక్షలు డ్రా.. ఏలూరులో నయా సైబర్ మోసం

ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు విపరీతంగా రెచ్చిపోతున్నారు. కాస్త ఏమరపాటుగా ఉంటే చాలు బ్యాంక్ అకౌంట్లోని సొమ్మంతా నొక్కేస్తున్నారు. ఇలాగే జిల్లా ఏలూరులో ఓ ఆగంతకుడు ఏటీఎం కార్డు ద్వారా ఏకంగా రూ.11.94లక్షలు కొట్టేశాడు. సొమ్ము డ్రా చేద్దామని బ్యాంకుకు వెళ్లిన బాధితురాలు తన అకౌంట్లో సొమ్ము లేదని తెలిసి షాకైంది. Also Read: విద్యానగర్‌కు చెందిన రాజేశ్ తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఇటీవల ఆయన మృతి చెందడంతో ప్రభుత్వం నుంచి కుటుంబసభ్యులకు పెద్దమొత్తంలో ఎక్స్‌గ్రేషియా వచ్చింది. దీంతో ఆ సొమ్ము డ్రా చేసేందుకు రాజేశ్ తల్లితో కలిసి ఈ ఏడో తేదీన బ్యాంక్‌కు వెళ్లాడు. అయితే అకౌంట్లోని రూ.11.94 లక్షల సొమ్ము అప్పటికే డ్రా చేసినట్లు బ్యాంకు అధికారులు చెప్పడంతో వారు షాకయ్యారు. Also Read: దీంతో బాధితులు ఏలూరు త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగుడు జూన్ నెల నుంచి ఏటీఎం ద్వారా 28 సార్లు డబ్బు డ్రా చేసినట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ మూర్తి ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. Also Read:
By August 09, 2020 at 11:21AM
No comments