YS Jagan: ఏపీకి మూడు రాజధానులు వేస్ట్.. లాజిక్ వదిలిన వర్మ
ఏపీకి మూడు రాజధానులు ఇష్యూపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు వివాదాల దర్శకుడు వర్మ. రాజధానుల విషయంపై తనకు అవగాహన లేదంటూనే ఇదో టైమ్ వేస్ట్ ప్రాసెస్ అంటూ తేల్చేశారు వర్మ. ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రానికి రాజధాని ఏం ఉపయోగం.. అసెంబ్లీ ఉందనుకుందాం.. దాని వల్ల ఉపయోగం ఏంటి.. అందరూ వచ్చి అరుచుకుంటారు.. కొట్టుకుంటారు. అంత టైం వేస్ట్ చేయడం ఎందుకో.. ఇలాంటి దాని కోసం టైం అండ్ డబ్బు వేస్ట్ చేయడం ఎందుకనేది నా అభిప్రాయం. నాకు క్యాపిటల్ అనే కాన్సెప్ట్ పడదు. 20 ఏళ్ల క్రితం మెయిన్ థియేటర్ అని ఉండేది.. ఇప్పుడు ఆ మెయిన్ థియేటర్ కాన్సెప్ట్ జీరో. సినిమా బాగుంటే ఆడుతుంది లేదంటే లేదు.. దీనికి థియేటర్స్‌తో సంబంధం ఏంటి? మన టెక్నాలజీని ఉపయోగిస్తే.. ఒక పని కోసం ఇద్దరు కలవాల్సిన పనేలేదు. క్లియర్ కట్‌గా మనం చెప్పాల్సిన విషయాన్ని చెప్పేయొచ్చు. పోనీ లాజికల్‌గా ఏదైనా చెప్తారా అంటే ఆ అసెంబ్లీలో అరుచుకోవడం తప్ప ఏం ఉండదు. అసెంబ్లీ విషయాన్ని పక్కనపెట్టేద్దాం.. అడ్మినిస్టేషన్ విషయానికి వస్తే.. నిర్ణయాలు ఎక్కడ కూర్చుని చేస్తే ఏంటి?? ప్లేస్‌కి కాదు చేసే పనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. హైటెక్ సిటీలో ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. సగం మంది ఆఫీస్‌లకు వెళ్లరు.. ఇంట్లోనే ఉండి చేస్తారు. నా ఆఫీస్‌నే తీసుకుందాం.. నేను ప్రతిరోజు వాళ్లను ఆఫీస్‌కి రావొద్దని చెప్తా. మీరు ఎక్కడ నుండి అయినా పని చేయండి.. నాకు వర్క్ పూర్తి కావాలి. దానికి ఆఫీస్‌కి వచ్చి టేబుల్‌పై కూర్చోవాల్సిన పనిలేదు. నా దగ్గర పనిచేస్తూ వేరే చోట కూడా పనిచేసుకోమని చెప్తా.. అది మీ కెపాసిటీ. ఒక్కచోక కాకపోతే 10 చోట్ల పనిచేసుకోండి.. అది మీ ఇష్టం.. మీ టాలెంట్.. నాకు మాత్రం పని కావాలి. ఎక్కడ నుంచి చేశారన్నది నాకు అనవసరం. రాజధాని విషయంలో కూడా నా అభిప్రాయం ఇదే.. ఒకే చోట కూర్చుని నిర్ణయాలు చేయడానికే మూడు రాజధానులు అంటే అలాంటిది అవసరం లేదని నాకు అనిపిస్తుంది. అయితే నాకు దీనిపై పెద్ద అవగాహన లేదు కాని.. నిజానికి రాష్ట్రానికి రాజధాని ఏం చేస్తుందో తెలియదు. రాజధాని ఉండటమే అనవసరం అని నా ఫీలింగ్’ అంటూ చెప్పుకొచ్చారు వర్మ.
By July 13, 2020 at 12:30PM
No comments