‘నువ్వులేక నేనులేను’ .. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య
వారిద్దరికి ఒకరంటే ఒకరు ప్రాణం. ప్రేమించుకుని ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజులకే ఆమె గర్భం దాల్చింది. నెలలు నిండటంతో పురిటినొప్పులతో బాధపడుతూ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే వారి అన్యోనాన్ని చూసి విధికి కన్ను కుట్టింది. ప్రసవ వేదనను తట్టుకోలేక భార్య ప్రాణాలు కోల్పోయింది. తన ప్రాణం ఈ లోకాన్ని విడిచి వెళ్లాక తనకు ఇక్కడెందుకు ఉండాలనుకున్న భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రుల మృతితో రోజుల పసిగుడ్డు అనాథగా మారడం అందరినీ కలిచి వేసింది. ఈ విషాదకర ఘటన విశాఖ జిల్లా సింహాచలం కొండపైన ఉన్న ఓ గిరిజన గ్రామంలో జరిగింది. Also Read: సింహగిరి గిరిజన గ్రామానికి చెందిన జలుమూరి శ్రావణ్‌కుమార్ (20), ఎదురింట్లో ఉండే అంబిక ప్రేమించుకుని ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. అంబిక గర్భవతి కావడంతో ప్రసవం కోసం ఈ నెల 6న విశాఖ కేజీహెచ్‌కు తీసుకొచ్చారు. ప్రసవం సమయంలో ఆమెకు ఫిట్స్ రావడంతో డాక్టర్లు సిజేరియన్ చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే 8వ తేదీన పరిస్థితి విషమించడంతో అంబిక హాస్పిటల్‌లోనే ప్రాణాలు కోల్పోయింది. Also Read: అప్పటి నుంచి శ్రావణ్‌కుమార్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడిని గమనించిన గ్రామస్థులు కిందికి దించి చూసేసరికి ప్రాణాలు కోల్పోయాడు. ఐదు రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో పసిగుడ్డు అనాథగా మారాడు. శ్రావణ్‌కుమార్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గోపాలపట్నం సీఐ మళ్ల అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రావణ్ మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. Also Read:
By July 14, 2020 at 08:27AM
No comments