Sri Rapaka: పవన్ కళ్యాణ్‌తో దానికి రెడీ.. ఆయన పిలవాలే గానీ!! నగ్నం హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
కరోనా విలయతాండవంలోనూ తనదైన రూట్‌లో వెళుతూ హాట్ బ్యూటీలను పరిచయం చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. వరుసబెట్టి అడల్ట్ కంటెంట్ సినిమాలు తీస్తున్న ఆయన ఇటీవలే ‘నగ్నం’ సినిమా ద్వారా (స్వీటీ)ని, ఆమె అందాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. దీంతో ఒక్కసారిగా ఫేమ్ అయి, భారీ పాపులారిటీ దక్కించుకున్న శ్రీ రాపాక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బోల్డ్ కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్‌తో డేటింగ్‌కి రెడీగా ఉన్నానని ఓపెన్‌గా చెప్పేసి షాక్ ఇచ్చింది శ్రీ రాపాక. ఒక్కో ఇంటర్వ్యూలో ఒక్కో విషయాన్ని హైలెట్ చేస్తున్నఆమె.. ఇటీవల బాలయ్య గురించి సంచలన విషయాలు బయటపెట్టడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో డేటింగ్ చేస్తానని చెప్పడం ఫిలిం నగర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. Also Read: ఇప్పుడున్న హీరోల్లో తనకు అంటే క్రష్ అని చెప్పిన శ్రీ రాపాక.. అప్పట్లో ఆయనను కలవాలని రెండు మూడు సార్లు ట్రై చేసినా కుదరలేదని, దాంతో ఆ ప్రయత్నం విరమించుకున్నానని తెలిపింది. అయితే పవన్‌ని కలవాలని రాసిఉంటే అదే జరుగుతుంది తప్ప ఎవ్వరినీ రిక్వెస్ట్ చేయకూడదని డిసైడ్ అయినట్లు ఆమె పేర్కొంది. ఒకవేళ ఆయన పిలవాలే గానీ డేటింగ్ చేయడానికి కూడా వెనుకాడనంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది శ్రీ రాపాక. నిజానికి శ్రీ రాపాకకు తెలుగు ఇండస్ట్రీ కొత్తేమీ కాదు. గత పదేళ్ల నుంచి ఇండస్ట్రీతో ఆమెకు అనుబంధం ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ప్రొఫెషనల్ ఫ్యాషన్ డిజైనర్‌లలో ఒకరుగా అన్ని ప్రొడక్షన్ హౌస్‌లు, నిర్మాతలు, డైరెక్టర్లకు ఆమె సుపరిచితం. కాకపోతే వర్మ కన్నుపడి ఇలా ఉహించనివిధంగా జనాల్లో ఫేమ్ సంపాదించింది శ్రీ రాపాక.
By July 08, 2020 at 11:05AM
No comments