Radhe Shyam: మెగా హీరోని డబ్బింగ్ కొట్టేశారు.. అచ్చం అలాగే! ప్రభాస్ 'రాధే శ్యామ్' పోస్టర్‌పై ట్రోల్స్
అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ ఆయన 20వ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. నేడు (జులై 10) కొద్దిసేపటి క్రితం విడుదలైన ఈ పోస్టర్ చూసి రెబల్ స్టార్ అభిమానులు పండగ చేసుకున్నారు. ప్రభాస్- రొమాంటిక్ స్టిల్ అదిరింది అంటూ తెగ వైరల్ చేసేశారు. ఇంతలోనే ఈ పోస్టర్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ప్రారంభం కావడం అందరికీ షాక్ ఇచ్చింది. తాజాగా విడుదలైన ప్రభాస్ '' పోస్టర్‌ను గతంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'కంచె' సినిమా పోస్టర్‌తో పోల్చుతూ అదే పోస్టర్ డబ్బింగ్ కొట్టేశారంటూ కామెంట్స్ వస్తున్నాయి. అప్పట్లో వచ్చిన కంచె సినిమా పోస్టర్‌లో కూడా వరుణ్ తేజ్- ప్రగ్యా జైస్వాల్ అచ్చం ప్రభాస్- పూజా హెగ్డే లాగే రొమాంటిక్ లుక్‌లో కనిపించారు. దీంతో ఈ రెండు పోస్టర్ జత చేస్తూ ట్రోల్స్ స్టార్ట్ చేసేశారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ రెండు సినిమాల పోస్టర్స్ తో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. Also Read: భారీ బడ్జెట్ కేటాయించి ప్రభాస్- పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా 'రాధే శ్యామ్' మూవీ రూపొందిస్తున్నారు. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. 1960 దశకం నాటి ప్రేమకథతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
By July 10, 2020 at 11:54AM
No comments