Breaking News

Namrata Shirodkar: మహేష్ బాబు ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్! వీడియోతో పాటు రహస్యాన్ని బయటపెట్టిన నమ్రత..


సూపర్ స్టార్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ హీరోల్లోకెల్లా అత్యంత అందగాడిగా లేడీ అభిమానుల మనసు దోచుకోవడంలో మొదటిస్థానం మహేష్‌దే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఈ సూపర్ స్టార్‌కి క్లాస్, మాస్ ఆడియన్స్‌తో పాటు మహిళా అభిమానులు చాలా ఎక్కువ. నాలుగు పదుల వయసు దాటినా అబ్బురపరిచే ఫిట్‌నెస్‌తో ఇరవై ఏళ్ల కుర్రాడిలా హ్యాండ్సమ్‌గా కనిపిస్తారు మహేష్ బాబు. అయితే ఆ ఫిట్‌నెస్‌ వెనుక సీక్రెట్ ఏంటి? అనేది తెలుసుకోవడమంటే అందరికీ ఆసక్తే కదండీ. సరిగ్గా ఆ పాయింట్ క్యాచ్ చేస్తూ తాజాగా ఆ రహస్యం బయటపెట్టేసింది ఆయన సతీమణి . Also Read: నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ మహేష్ బాబు సినిమా సంగతులు, తమ కుటుంబ విషయాలు అభిమానులతో పంచుకునే నమ్రత.. తాజాగా మహేష్ జిమ్‌ని పరిచయం చేసింది. ఫిట్‌నెస్ కోసం ఈ జిమ్‌లోనే మహేష్ చాలా శ్రమిస్తాడని పేర్కొంది. ఈ మేరకు `ఫీల్ ది థండర్` అంటూ ఆ జిమ్ తాలూకు వీడియోని తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది నమ్రత. దీంతో.. మహేష్ బాబు ఇంట్లోనే ఉన్న ఈ విశాలపమైన జిమ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'మహేష్ బాబు ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదన్నమాట' అంటూ కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. ఇక మహేష్ సినిమాల విశయానికొస్తే.. ఈ ఏడాది ఆరంభంలోనే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన '' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి. మైత్రీ మూవీస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14రీల్స్‌ ప్లస్‌ పతాకాల సంయుక్త సమర్పణలో నవీన్‌ యర్నేని, రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలుగా పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ టైటిల్ లుక్ ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది.


By July 16, 2020 at 10:46AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/namrata-shirodkar-shared-mahesh-babu-home-gym-video-goes-viral/articleshow/76992798.cms

No comments