Breaking News

Namrata Shirodkar: మహేష్ బాబును చూడగానే మా అమ్మానాన్న!! మ్యారేజ్ సీక్రెట్స్ చెప్పేసిన నమ్రత..


టాలీవుడ్ క్రేజీ జోడీల్లో ఒకటి మహేష్ బాబు- జంట. వాళ్ళ పిల్లలు గౌతమ్, సితార కూడా చిన్నతనం లోనే సెలబ్రిటీ హోదా పట్టేశారు. దీంతో ఫ్యామిలీ ట్రిప్స్, ఆ కుటుంబానికి సంబంధించిన సంగతులు ప్రేక్షకలోకానికి ఎప్పుడూ ఆసక్తికర విషయాలే. ఈ నేపథ్యంలోనే తాజాగా 'ఆస్క్ మీ యువర్ క్వశ్చన్' సెషన్‌లో పాల్గొన్న నమ్రత తన కుటుంబ విషయాలు, మహేష్‌తో పెళ్లి, రిలేషన్‌షిప్ తాలూకు సంగతులపై స్పందించింది. సోషల్ మీడియా వేదికగా జరిగిన ఈ సెషన్‌లో నెటిజన్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు బదులిచ్చింది నమ్రత. ఇష్టమైన హీరో ఎవరని ఓ నెటిజన్ అడగటంతో.. ఇది కాస్త కష్టమైనా ప్రశ్ననే అయినా మహేష్ బాబు అని తెలిపింది. మహేష్ సినిమాల్లో తనకు ''ఒక్కడు, పోకిరి, దూకుడు, మహర్షి, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు'' చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. తాను మహేష్ బాబు సినిమాల ఎంపిక విషయంలో అస్సలు తలదూర్చనని నమ్రత తెలిపింది. Also read: ఇకపోతే మహేష్‌తో పెళ్లికి సంబంధించిన ప్రశ్నలపై రియాక్ట్ అయిన నమ్రత.. తన తల్లిదండ్రులు మహేష్ బాబును ఫస్ట్‌టైమ్ చూడగానే తన మాదిరే ప్రేమలో పడిపోయి, వెంటనే పెళ్లికి అంగీకరించారని ఆమె చెప్పింది. తన జీవితంలో మధుర క్షణాలు మహేష్‌ని పెళ్లి చేసుకోవడం, ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వడం అని నమ్రత చెప్పింది. భవిష్యత్తులో ఒక్కసారైనా మళ్ళీ మహేష్‌తో కలిసి నటించే అవకాశం వస్తుందేమో చూడాలని ఆమె చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకున్న మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీ అతిత్వరలో రెగ్యులర్ షూట్‌కి రానుంది.


By July 02, 2020 at 09:10AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/namrata-shirodkar-shares-her-marriage-moments-with-mahesh-babu/articleshow/76741800.cms

No comments