Breaking News

LAC Pullback పాంగాంగ్ సరస్సు నుంచి వెనక్కు మళ్లుతున్న చైనా, కానీ...


సరిహద్దుల్లో భారత్-చైనా సైన్యాల వెనక్కు మళ్లింపు ప్రక్రియ కొనసాగుతోంది. జూన్ 15న ఘర్షణ చోటుచేసుకున్న గాల్వాన్ లోయ, గోగ్రా హాట్ స్పాట్ నుంచి ఇరు దేశాలూ 2 కిలోమీటర్ల మేర పూర్తిగా వెనక్కు మళ్లాయి. ఆ ప్రాంతంలో బఫర్ జోన్‌ను ఏర్పాటుచేశారు. తాజాగా, తూర్పు లడఖ్‌‌లోని పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరం నుంచి చైనా తన సైన్యాన్ని వెనక్కు మళ్లించే ప్రక్రియ ప్రారంభించినా కానీ, చెప్పుకోదగ్గ విధంగా లేదు. పాంగోంగ్ సరస్సు ఉత్తరం తీరంలో ఉన్న ‘ఫింగర్ -4’ నుంచి ‘ఫింగర్ -5’ ప్రాంతాల్లో చైనా తన సైనికులను పూర్తిగా ఉపసంహరించుకోవడం జరిగితే, ఉద్రిక్తతలను తగ్గించే ప్రక్రియలో మొదటి దశ పూర్తి కావడానికి సంకేతం. ఫింగర్-4 వద్ద కొన్ని గూడారాలను తొలిగించిన సీపీఎల్ఏ.. స్వల్ప సంఖ్యలో వాహనాలను వెనక్కు పంపుతోంది కానీ, పూర్తిగా ఆ ప్రాంతం నుంచి వైదొలగలేదు. పాంగాంగ్ సరస్సు వద్ద (13,900 అడుగుల ఎత్తులో) ఫింగర్ 4-8 వరకు 3,000 మంది సీపీఎల్ఏ సైనికులు మే ప్రారంభం నుంచి అక్కడ మోహరించడతో ఇరు దేశాల మధ్య ఘర్షణకు దారితీసింది’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ ప్రాంతంలో నెలకున్న పరిస్థితిపై లడఖ్‌‌లో ఇరు దేశాల స్థానిక అధికారులు సమావేశమై చర్చించారని భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశానికి లడఖ్ పాలనా యంత్రాంగం, ఆర్మీ, ఐటీబీపీ అధికారులు పాల్గొన్నారు. తమతోపాటు సమానంగా భారత్ దళాలు కూడా వెనక్కి తగ్గుతాయనే చైనా అంచనా. అంటే, భారత్ ఎల్ఏసీ నుంచి మరింత వెనుకకు వెళుతుంది, అయితే చైనా అది చొరబడిన ప్రాంతం నుంచి మాత్రమే వెనక్కి తగ్గుతుంది. ఇది బేరసారాల వ్యూహం కావచ్చు కానీ, ఈ ప్రక్రియను పొడిగించవచ్చు’ అని వ్యాఖ్యానించాయి. ఎల్ఏసీ వెంబడి ఫింగర్ -8 వద్ద ఉత్తరం నుంచి దక్షిణం వైపు పీఎల్‌ఏ దళాలు తూర్పు వైపున సిరిజాప్ -1, II వద్ద శాశ్వత స్థావరాలవైపు వెనక్కు మళ్లాలని భారత్ కోరుకుంటుంది. ఫింగర్ -3, 4 మధ్య పరిపాలనా స్థావరంతో పాటు ఫింగర్ -2, 3 మధ్య భారత్‌కు ఒక పోస్ట్ ఉంది. అయితే, ఫింగర్ 4 నుంచి 8 వరకు అనేక ప్రాంతాల్లో స్థావరాలను నిర్మించిన చైనా, ఫింగర్ 2 వరకు భూభాగం తమదేనని వాదిస్తోంది. భారత్‌కు ఎంతో కీలకమైన ఈ ప్రాంతంలోని రెండు రహదారులకు ఇబ్బందికరంగా పరిణమించింది. ఫేజ్ -1 కింద ఫింగర్ -4 నుంచి 5కి వెనక్కి వెళ్లడానికి పిఎల్‌ఎ అంగీకరించింది. స్థానిక కమాండర్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి. పాంగోంగ్ సరస్సు గురించి చర్చించడానికి కార్ప్స్ కమాండర్లు మళ్ళీ భేటీ అవుతారని అని ఆ వర్గాలు తెలిపాయి.


By July 09, 2020 at 08:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-china-lac-pullback-slight-reduction-in-pla-troops-at-pangong-tso/articleshow/76865747.cms

No comments