Breaking News

Kalyan Dev: ఒంటరిగా ఉంటున్న చిరంజీవి అల్లుడు.. షాకింగ్ డిసీజన్.. ఇంటిపనులన్నీ తానే చేసుకుంటూ!


ఓ వైపు కరోనా విజృంభణ కొనసాగుతోంది.. మరోవైపు కొన్ని సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయి. దాదాపు రెండున్నర నెలలపాటు వాయిదాపడ్డ సినిమా షూటింగ్స్, షరతులతో కూడిన ప్రభుత్వ అనుమతితో రీసెంట్‌గా ఓపెన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తన తాజా సినిమా ‘’ కోసం సెట్స్ పైకి వచ్చాడు చిరంజీవి అల్లుడు . ఈ క్రమంలోనే ఆయన, తన ఫ్యామిలీ కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ విధించడంతో ఆగిపోయిన ‘సూపర్‌ మచ్చి’ షూటింగ్‌ని తిరిగి ఇటీవలే రామానాయుడు స్టూడియోస్‌లో పునఃప్రారంభించారు. షూటింగ్స్ పర్మిషన్స్ వచ్చాక సెట్స్ మీదకు వచ్చిన మొదటి సినిమా కూడా ఇదే. అయితే ఈ తాజా షెడ్యూల్‌లో మిగిలిన షూటింగ్ సహా పాటల షూటింగ్ కూడా పూర్తి చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. దీంతో షూటింగ్ నిమిత్తమై ప్రతిరోజు కళ్యాణ్ దేవ్ సెట్స్ మీదకు రావడం జరుగుతోంది. Also Read: ఈ నేపథ్యంలో తాజా పరిస్థితుల దృష్ట్యా బయట షూటింగ్స్ చేసి ఇంట్లోకి రావడం మంచిది భావించిన కళ్యాణ్ దేవ్.. తనకు తాను స్వీయ నిర్బంధం విధించుకున్నారట. షూటింగ్ మొత్తం పూర్తై, తనకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ముగిసే వరకు ఫ్యామిలీకి దూరంగా ఉండాలని ఆయన భావిస్తున్నారట. ఈ మేరకు తన ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒంటరిగానే ఉంటూ ఇంటిపనులన్నీ తానే చేసుకుంటున్నారట. తన కుమార్తెతో, భార్య శ్రీజతో తరచూ మాట్లాడటానికి కూడా నేరుగా కలవకుండా.. వీడియో కాల్ చేస్తున్నారట. దీంతో కరోనా పట్ల, కుటుంబ శ్రేయస్సు కోసం కళ్యాణ్ దేవ్ తీసుకుంటున్న ఈ జాగ్రత్తలు అందరికీ ఆదర్శం అని ప్రశంసిస్తున్నారు సీనియర్ డాక్టర్లు.


By July 03, 2020 at 08:22AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mega-hero-kalyan-dev-in-self-quarantine-for-his-family-health/articleshow/76761791.cms

No comments