Breaking News

ButtaBomma: బ్రేకుల్లేవ్! అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డ్.. టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన ఘనత


ఈ ఏడాది ఆరంభంలోనే '' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు స్టైలిష్ స్టార్ . ఈ సినిమా పలు రికార్డులను తిరగరాసి నాన్ బాహుబలి రికార్డ్స్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. అంతేకాదు విడుదలై ఆరు నెలలు గడిచిపోయినా తన రికార్డులకు బ్రేకుల్లేవ్ అంటూ దూసుకుపోతోంది. తాజాగా ఈ మూవీ లోని ''బుట్టబొమ్మ'' సాంగ్ టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. దీంతో ల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డ్ చేరినట్లయింది. మొదటి నుంచే ‘బుట్టబొమ్మ’ పాట రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. యూట్యూబ్‌లో ఈ పాటకు నేటికీ భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఇప్పటికే అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు పాటగా ‘బుట్టబొమ్మ’ సాంగ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో 2 మిలియన్లకు పైగా లైక్స్ సాధించిన తొలి తెలుగు వీడియో సాంగ్‌గా మరో రికార్డు నెలకొల్పింది. ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేసిన చిత్రయూనిట్.. ప్రేక్షకలోకానికి కృతజ్ఞతలు చెప్పింది. మరోవైపు ‘బుట్టబొమ్మ’ పాటకు సాధారణ- సెలబ్రిటీ అనే తేడా లేకుండా అందరూ స్టెప్పులేస్తున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నారు. అంతేకాదు ఈ 'అల.. వైకుంఠపురములో' చిత్రంలోని ‘సామజవరగమన’, ‘రాములో రాముల’ పాటలు సైతం ఆన్‌లైన్ వేదికలపై హంగామా చేస్తున్నాయి. Also Read: అల్లు అర్జున్- పూజా హెగ్డే డాన్స్, థమన్ బాణీలు ప్రేక్షకలోకాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటాకీ 'అల.. వైకుంఠపురములో' ఆల్బమ్‌కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. ఇంకా మరెన్నో రికార్డ్స్ సొంతం చేసుకోవడం ఖాయం అని తెలుస్తోంది.


By July 12, 2020 at 12:03PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/allu-arjuns-buttabomma-creates-new-record-in-tfi/articleshow/76919308.cms

No comments