ప్రేమపెళ్లికి నిరాకరించిన పెద్దలు... ఉరేసుకుని యువతి ఆత్మహత్య
ప్రియుడితో పెళ్లికి పెద్దలు నిరాకరించారన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్ణాటకలో విషాదం నింపింది. బెంగళూరు అర్బన్ జిల్లా అనేకల్ పట్టణంలోని బ్రాహ్మణ వీధికి చెందిన తనూజ(22) అనే యువతి పీయూసీ సెకండియర్ చదువుతోంది. తల్లిదండ్రులు చేనేత కార్మికులు. ఈ క్రమంలోనే తనూజ తనతో పాటు చదివే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. Also Read: దీంతో తనూజ తల్లిదండ్రులకు తన ప్రేమ విషయం చెప్పి అతడితో పెళ్లి చేయాలని కోరింది. దీనికి వారు అంగీకరించకపోవడంతో ఆవేదనకు గురైంది. బుధవారం రాత్రి ఇంట్లో అందరూ పడుకున్న సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారంతో గురువారం పోలీసులు ఆమె ఇంటికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By July 10, 2020 at 10:52AM
No comments