Breaking News

వరుడి ఊరేగింపు... ఇంతలో షాక్ ఇచ్చిన మొదటి భార్య


ఓ యువకుడికి పెళ్లి కుదిరింది. పెళ్లి ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ముహుర్తం కూడా ముందుకొచ్చింది. దీంతో ధూంధాంగా వధువు ఇంటికి ఊరేగింపుగా బయల్దేరాడు వరుడు. బాజా భజంత్రీలతో అమ్మాయిని పెళ్లాడేందుకు బయల్దేరాడు. ఇంతలో అతడికి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. మొదటి భార్య ఎదురొచ్చి అతడి బండార బయట పడేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని మంగళపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల లాల్జీ కా పూర్వా గ్రామంలో నివసిస్తున్న మన్వేంద్ర సింగ్ యాదవ్ అనే యువకుడు నివసిస్తున్నాడు. అతడు సీఆర్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 2015లో మన్వేంద్ర సింగ్ ఒక యువతితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పరుచుకున్నాడు. వారిద్దరి పరిచయం ప్రేమకు దారి తీసింది. దీంతో ఇద్దరూ కలిసి 2018లో ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండ మరో యువతితో మన్వేంద్ర పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య అక్కడు చేరుకుంది. మన్వేంద్ర పెళ్లి ఊరేగింపులో వరుని మొదటి భార్య పోలీసులతో సహా ఎంట్రీ ఇచ్చింది. ఆ యువకుడు తనను ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నాడని, తనను శారీరకంగా వేధింపులకు గురిచేశాడని, గర్భస్రావం కూడా చేయించాడని ఆమె ఆరోపించింది. మొదటి భార్య ఉండగా, రెండవ పెళ్లి ఎలా చేసుకుంటాడని మన్వేంద్రను నిలదీసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు వరుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పెళ్లి ఊరేగింపు ఆగిపోగా, పెళ్లికి వచ్చినవారంతా ఈ ఘటనతో విస్తుపోయారు. పోలీసుల్ని అతడ్ని తీసుకెళ్లడంతో షాక్ తిన్న వధువు కుటుంబసభ్యులు ఏం చేయాలో అర్థంకాక సతమతమవుతున్నారు.


By July 02, 2020 at 11:56AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/first-wife-complaint-police-groom-arrested-in-barat-at-uttar-pradesh/articleshow/76744756.cms

No comments