Breaking News

పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకొని.. మోసపోయిన లేడీ అసిస్టెంట్ డైరెక్టర్


ప్రేమ పెళ్లి పేరుతో అమాయకులు, యువత మాత్రమే కాదు.. బాగా చదువుకున్నవారు.. మంచి పొజిషిన్‌లో ఉన్నవారు సైతం మోసపోతున్నారు. తాజాగా సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఓ మహిళా అసిస్టెంట్ డైరెక్టర్ సైతం మోసపోయిన ఘటన వెలుగు చూసింది. బెంగుళూరు మారుతీ నగర్‌లో 32 ఏళ్ల మహిళ సహాయ దర్శకురాలిగా పనిచేస్తున్నారు 2018లో ఆమెకు ఫేస్‌బుక్‌లో ఓ వ్యక్తితో పరిచయం అయ్యింది ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఇద్దరూ కొంతకాలం పాటు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకుంటానని అతడు నమ్మించడంతో శారీరకంగా కూడా ఇద్దరూ ఒక్కటయ్యారు. ఆ తర్వాత అతడిని పెళ్లి చేసుకోవాలని కోరగా మొహం చాటేశారు. అతడి నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. ఇంట్లోవాళ్లు చూసిన యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే తమ మధ్య ఉన్న ప్రేమ విషయాన్ని ఇతరులతో చెబితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అనంతరం సొణ్ణేనహళ్లిలో అద్దె ఇంటిలో కాపురం పెట్టారు. Read More: చేయడమే కాకుండా అవసరాలు ఉన్నాయంటూ పలుమార్లు ఆమె వద్ద నుంచి లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఈ ఏడాది జనవరి 12 తేదీన మరో రూ.5 లక్షలు ఇవ్వాలని కోరగా ఆమె నిరాకరించింది. ఆ తర్వాత అతను అడ్రస్ లేకుండా పోయాడు. ఫోన్‌ కూడా స్విచ్చాప్‌ చేశాడు. దీంతో బాధితురాలు తాను మోసపోయానని తెలుసుకొని బసవనగుడి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియుడి కోసం గాలిస్తున్నారు.


By July 18, 2020 at 08:45AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/lady-assistant-director-cheated-by-boy-friend-and-file-a-police-complaint-against-him/articleshow/77029493.cms

No comments