Breaking News

చికిత్సకు నిరాకరించిన ఆస్పత్రులు.. మృత్యువుతో పోరాడి ఓడిపోయిన కరోనా యోధుడు


ఆయన రోగులు ఎందరికో ప్రాణదానం చేశాడు. కరోనాపై ముందుండి పోరాటం చేసిన ఆయన మహమ్మారి బారినపడితే.. ఆయనను చికిత్సకు చేర్చుకోడానికి ప్రయివేట్ హాస్పిటల్స్ నిరాకరించడంతో చివరకు గురువారం మృత్యు ఒడికి చేరిన విషాద ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. డాక్టర్ మంజునాథ్ రామనగర జిల్లా కనకపురా తాలూకాలోని చిక్కలముడివాడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్-19 విధులు నిర్వహించారు. Read Also: ఈ సమయంలోనే డాక్టర్ మంజునాథ్‌కు కరోనా సోకింది. దీంతో మంజునాథ్‌ను చికిత్స కోసం బెంగళూరు తరలించగా.. ఆయనను చేర్చుకోడానికి మూడు ప్రయివేట్ ఆస్పత్రులు నిరాకరించాయి. చివరకు బెంగళూరు మెడికల్ కాలేజ్, రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించి చికిత్స అందజేసినా ప్రాణం నిలబడలేదు. గురువారం ఆయన తుది శ్వాస విడిచారు. అయితే, రెండు రోజుల వ్యవధిలోనే కరోనాతో ఆ కుటుంబంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మంజునాథ్ మామ రెండు రోజుల కిందటే కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. Read Also: మంజునాథ్ బంధువు బీబీఎంపీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ.. జూన్ 25న తీవ్ర జ్వరంతోపాటు ఊపిరితీసుకోడానికి ఇబ్బందిపడ్డారని తెలిపారు. అనుమానిత కేసు కావడంతో పరీక్షల కోసం నమూనాలు సేకరించారు.. తాము వైద్యులమైనా మూడు ఆస్పత్రులకు తిరిగినా ఎక్కడా చేర్చుకోలేదు.. కరోనా నిర్ధారణ ఫలితాల నివేదిక లేదని చెప్పి వెనక్కు పంపారన్నారు. Read Also: తొలుత ఓ ఆసుపత్రి తిరస్కరించడంతో మరో ఆస్పత్రి ఈ నిర్ణయం తీసుకునే ముందు ఎందుకు అలా చేసిందని అడిగారు...చివరకు కుమారస్వామి లేఅవుట్‌లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రి ముందు రోడ్డుపై బైటాయించామని, ఆ తర్వాత అక్కడ చేర్చుకున్నారు.. పరిస్థితి కొంత మెరుగుపడిన తర్వాత జులై 9న బీఎంఆర్సీకి తరలించి, వెంటిలేటర్‌పై చికిత్స అందజేశారు.. ఊపిరితిత్తులకు వైరస్ విస్తరించలేదని, పీడిత స్థితిలో ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్పారు, కానీ అది జరగలేదు’అని ఆయన వాపోయారు. Read Also: మంజునాథ్‌కు ఫిజియోథెరపిస్ట్ సహాయం అవసరం.. అయితే, పీపీఈ కిట్ ధరించి కోవిడ్ ఐసీయూలో ప్రవేశించడానికి ఫిజియోథెరపిస్ట్ అంగీకరించలేదు. దీంతో ప్రైవేట్ ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించడంతో అతడు వచ్చి సహకరించాడన్నారు. మంజునాథ్ కుటుంబంలోని భార్య, కుమారుడి సహా ఆరుగురికి వైరస్ సోకగా.. వీరు కోలుకున్నారు.


By July 23, 2020 at 11:32AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bengaluru-sent-back-by-three-hospitals-covid-doctor-loses-28-day-battle-to-virus/articleshow/77121889.cms

No comments