Breaking News

మరోసారి డ్యాన్స్‌తో రచ్చచేసిన ప్రగతి.. హమ్మ.. హమ్మ మతిపోగేట్టే అందం!! ఆ వర్కవుట్స్ చూస్తే..


సీనియర్ సినీ నటి మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసింది. గతంలో చాలా సార్లు తన డాన్స్, వర్కవుట్ వీడియోలతో అట్రాక్ట్ చేసిన ప్రగతి.. మళ్ళీ అదే పని చేసి వావ్! అనిపించింది. సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ ఎంతో పద్దతిగా చీరకట్టులో కనిపించే ఈ సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ లాక్‌డౌన్ సమయంలో ఫిట్‌నెస్‌పై ఫుల్లుగా ఫోకస్ పెట్టేసింది. ఈ మేరకు వ్యాయామాలు, డాన్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. లేటు వయసులో కూడా ఘాటైన అందాలతో సూపర్ స్టెప్పులేస్తుండటంతో ప్రగతి పోస్ట్ చేస్తున్న ఈ వీడియోలకు నెట్టింట ఫుల్ డిమాండ్ క్రియేట్ అయింది. దీంతో ఆమె ఫాలోవర్స్ అమాంతం పెరిగిపోతున్నారు. ఆ మధ్య విజయ్ మాస్టర్ సినిమా సాంగ్‌కి లుంగిలో తీన్మార్ స్టెప్పులేసి ఒక్కసారిగా అందరి చూపు తనవైపు తిప్పుకున్న ప్రగతి.. ఆ తర్వాత ఒక్కొక్కటిగా తన డాన్స్ వీడియోలు వదులుతూ సోషల్ మీడియా ట్రెండింగ్ యాక్ట్రెస్‌గా నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా 'బొంబాయి' సినిమాలోని ''హమ్మ.. హమ్మ'' పాటకు డాన్స్ చేసి పరేషాన్ చేసేసింది. బీట్‌కి తగ్గట్టుగా నడుముని తిప్పుతూ కుర్రకారు మతిపోగొట్టింది. ఇది చూసి.. ఆమె బాడీలో ఇంత రిథమ్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారంతా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read: ఇకపోతే వ్యాయాయం, వర్కవుట్స్ విషయంలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టింది ప్రగతి. ఈ మేరకు స్పోర్ట్స్ వేర్ దుస్తులు ధరించి ఇంట్లోనే వ్యాయాయం చేస్తోంది. తాను వ్యాయమ దుస్తుల్లో ఉన్న ఫోటోలను తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది ప్రగతి. ఈ ఫోటోలు, 44 ఏళ్ళ వయసులో కూడా ఆమె ఫిట్‌నెస్‌ చూసి.. ''వావ్! ప్రగతి ఆంటీ, సూపర్, బ్యూటిఫుల్'' అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. వెండితెరపై అయినా, సోషల్ మీడియాలో అయినా వీలైనంత వరకు అందంగా కనిపించడానికే ప్రగతి ఎక్కువగా ఇష్టపడుతుందని టాక్. కెరీర్ మొదటి నుంచి ఏ పాత్ర చేసిన ఇష్టంతోనే చేస్తానని ఆ పాత్రలో అందంగా కనిపించడానికి ట్రై చేస్తానని ఆమె పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. ఏదేమైనా నాలుగు పదుల వయసులో కూడా తన హోమ్లీ అందంతో ఇలా సోషల్ మీడియాను షేక్ చేయడం ఒక్క ప్రగతికే చెల్లుతుందేమో!.


By July 23, 2020 at 08:26AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-pragathi-dance-and-body-workouts-video-goes-viral-on-social-media/articleshow/77118919.cms

No comments