అది రేవ్ పార్టీ కాదు .. ట్విస్ట్ ఇచ్చిన బంజారాహిల్స్ పోలీసులు
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ స్టార్ హోటల్‌లో శనివారం జరిగిన పార్టీలో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేయడం, అందులో తెలంగాణకు చెందిన ఓ మంత్రి అల్లుడు ఉండటం కలకలం రేపిన సంగతి తెలిసింది. అర్ధరాత్రి హోటల్‌పై రైడ్ చేసిన పోలీసులు నలుగురు అమ్మాయిలు, నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఉక్రెయిన్‌కు చెందిన యువతి కూడా ఉంది. వీరంతా హోటల్‌లో ఓ గదిని బుక్ చేసుకుని రాత్రివేళ హంగామా చేశారు. అయితే అక్కడ రేవ్ పార్టీ జరుగుతుందని సమాచారం రావడంతో బంజారాహిల్స్ పోలీసులు, వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. Also Read: ఈ ఘటనలో సంతోష్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, భానుకిరణ్, విజయరామారావు, ఓ విదేశీ యువతితోపాటు మరో ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారంతా లాక్‌డౌన్, ఎక్సైజ్ నిబంధనల ఉల్లంఘించినట్లు గుర్తించి ఆయా చట్టాల కింద కేసులు నమోదు చేశారు. యువతులను మినహాయించి మిగతా నలుగురు నిందితులను సోమవారం రిమాండ్‌కు తరలించారు. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా అది రేవ్ పార్టీ కాదని, స్నేహితులంతా కలిసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకున్నట్లు తమ విచారణలో తేలినట్లు బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ కళింగరావు తెలిపారు. Also Read:
By July 07, 2020 at 09:33AM
No comments