Breaking News

అల్లుడిపై అత్తమామల ఫిర్యాదు.. 40రోజుల తర్వాత గర్భిణి మృతదేహానికి పోస్టుమార్టం


Also Read:అనుమానాస్పద స్థితిలో గర్భిణి మృతిచెందిన ఘటనలో 40 రోజుల తర్వాత కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తమ కూతురి చావుకు అల్లుడే కారణమంటూ మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఖననం చేసిన 40 రోజుల తర్వాత పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటన జిల్లా గ్రామీణ మండలంలో వెలుగుచూసింది. యర్రబల్లి గ్రామానికి చెందిన ప్రసాద్‌కు ఐదు సంవత్సరాల క్రితం గుర్రంకొండ మండలం రామాపురానికి చెందిన వసంత(28)తో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె. ప్రస్తుతం వసంత 8 నెలల గర్భిణి. Also Read: ఈ ఏడాది మే 27వ తేదీన ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వసంత ఫిట్స్‌తో చనిపోయిందని ప్రసాద్‌, అతని కుటుంబ సభ్యులు చెప్పడంతో వసంత కడుపులో ఉన్న బిడ్డను బయటకు తీసి అంత్యక్రియలు నిర్వహించారు. ఇటీవల మనువరాలు హేమను చూసేందుకు వసంత తల్లిదండ్రులు మంగమ్మ, తిమ్మయ్యలు అల్లుడి ఇంటికి వెళ్లగా ప్రసాద్ వారిని ఇంట్లోకి రానివ్వలేదు. ఈ క్రమంలోనే జరిగిన వాగ్వాదంలో వసంతను తానే చంపినట్లు ప్రసాద్ నోరు జారాడు. Also Read: దీంతో మంగమ్మ, తిమ్మయ్య మదనపల్లె గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురిని అల్లుడే చంపి ఫిట్స్‌తో చనిపోయినట్లు అందరినీ నమ్మించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వసంత మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. నివేదిక అందిన తర్వాత దర్యాప్తు ముమ్మరం చేస్తామని మదనపల్లె పోలీసులు తెలిపారు. Also Read:


By July 07, 2020 at 10:07AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/in-laws-compiants-on-son-in-law-for-he-kills-thier-pragnant-daughter-in-chittoor-district/articleshow/76826622.cms

No comments