పెళ్లైన ఐదురోజులకే నవ వధువు ఆత్మహత్య
కాళ్ల పారాణి ఆరకముందే ఓ వధువు బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివాహమైన ఐదో రోజే చేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తారాపురం మారుతీ నగర్‌కు చెందిన రాజ్ కుమార్తె దేవి (20), అమరావతికి చెందిన సమీప బంధువు సెల్వరాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ నెల 8న పెద్దల అంగీకారంతో వీరిద్దరి ప్రేమవివాహం జరిగింది. అయితే శనివారం ఉదయం దంపతులిద్దరూ దేవి ఇంటికి విందు భోజనానికి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం ఇంటి బయట వరుడు సెల్వరాజ్ బంధువులతో మాట్లాడుతున్నాడు. Read More: ఇంతలో ఏం జరిగిందో తెలయిదు కానీ.. వధువు దేవీ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకొంది. అయితే ఎంతసేపటికి బటయకు రాకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు తలుపులు బాదారు. అయినా తలుపు తీయలేదు. తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా ఇంటి దూలానికి దేవి చీరతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. దీంతో వెంటనే ఆమెను హుటాహుటిన తారాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. సెల్వరాజ్, దేవి తల్లిదండ్రులు బోరున విలపించారు. పెళ్లైన ఐదు రోజులకే ఇలా చేసుకోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. దేవీ బాడీనీ పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భార్యభర్తల మధ్య ఏమైనా తగాదాలు జరిగాయా అన్న కోణంలో సెల్వరాజ్‌ను విచారిస్తున్నారు.
By July 14, 2020 at 08:43AM
No comments