Breaking News

కరోనాను జయించిన బండ్ల గణేష్.. రిపోర్ట్ షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్


కరోనా మహమ్మారి ప్రభావంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ కమెడియన్, నిర్మాత, పౌల్ట్రీ యజమాని పూర్తిగా కోలుకున్నారు. తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజు రోజుకు కేసులు పెరుగిపోతున్నాయి. దీంతో మళ్లీ లాక్ డౌన్ చేస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే నగరంలో కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవడానికి వెళ్లిన నిర్మాత బండ్ల గణేష్‌కి కరోనా సోకడం ఇండస్ట్రీలో కలకలం రేగింది. ఒకవైపు షూటింగ్‌లు తిరిగి ప్రారంభమైన తరుణంలో బండ్ల గణేష్‌కి కరోనా సోకడంతో ఈ వైరస్ ఎప్పుడు ఏ సెలబ్రిటీకి వ్యాపిస్తుందా అనే ఆందోళనలో ఉన్నారు. అయితే సుమారు 14 రోజుల చికిత్స అనంతరం నిర్మాత బండ్ల గణేష్ కరోనాను జయించి పూర్తిగా కోలుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ తనను ప్రాణాలను కాపాడిన దేవుడికి ధన్యవాదాలు తెలియజేశారు బండ్ల గణేష్. ఈ సందర్భంగా అపోలో డయోగ్నోస్టిక్స్‌లో నిర్వహించిన కరోనా పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్‌ని షేర్ చేశారు బండ్ల గణేష్. కాగా ‘మీరు చేసిన మంచి పనులు వల్ల దేవుడు నీయందున ఉండి మీకు మంచి చేశారు.. కరోనాను జయించారు. జాగ్రత్తగా ఉండి మంచి ఆహారం తీసుకోండి’ అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.


By July 01, 2020 at 08:29AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/producer-bandla-ganesh-recovered-from-coronavirus/articleshow/76721745.cms

No comments