రాఘు రామ కృష్ణం రాజుపై వర్మ పోస్ట్.. అతని కులాన్ని ప్రస్తావిస్తూ కామెంట్స్
ఏంటండీ.. రాజుగారూ!! మీకు కాస్త వర్మ గాలి సోకినట్టు ఉంది.. ఆయనలాగే లాజిక్‌గా మాట్లాడుతూ నాకు నచ్చిందే చేస్తా.. నాకు ఇష్టం వచ్చింది మాట్లాడతా అని షోకాజ్‌లకే తిరిగి షోకాజ్‌లు ఇస్తున్నారు. కొంపతీసి మీపై వర్మ ప్రభావం ఏం లేదు కదా?? అని నరసాపురం వైసీపీ ఎంపీ రాఘు రామ కృష్ణం రాజును అడిగితే ఆయన నుంచి ఆసక్తికరమైన సమాధానం వచ్చింది. భలేవారే.. నాపై వర్మ ప్రభావం లేకపోవడం ఏంటండీ!! ఆయనంటే నాకు చాలా అభిమానం. ఆయన యాటట్యూట్ అంటే పిచ్చి. అంతేకాదు.. మా ఇద్దరిలో ఓ కామన్ పాయింట్ కూడా ఉంది. నేను ఆయన చాలా స్లోగా మాట్లాడుతుంటాం. ఇద్దరి వాయిస్‌లు ఇంచు మించు ఒకేలా ఉంటాయి. వాయిస్‌ల పరంగా మేం ఇద్దరం వీక్ అయినా ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టేస్తాం’ అంటూ ఈ ఎంపీ గారు తనలోని వర్మని బయటపెట్టారు. అయితే ఎంపీ వ్యాఖ్యలపై వర్మ స్పందిస్తూ.. ‘మైండ్ బ్లోయింగ్.. రాజుగారూ!! రాజకీయాల్లో ఇలాంటి పర్సనాలిటీని ఇప్పుడే చూస్తున్నా.. వెరీ ఇంట్రస్టింగ్ అంటూ కామెంట్ చేశారు. ఇక ట్విట్టర్‌లో రాఘు రామ కృష్ణం రాజుని సింహంతో పోల్చుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘నాకు రాజు అనే క్యాస్ట్ ఫీలింగ్ లేదు.., కాని నాకు ఖచ్చితంగా రఘు రామ కృష్ణరాజు ఫీలింగ్ ఉంది. ఎందుకంటే అతను నిజమైన సింహం.. అతను నిజమైన హీరో.. సింహం ఒక్కటే సింగిల్’ అంటూ ట్వీట్ చేశారు వర్మ. అయితే వర్మ పోస్ట్‌పై మండిపడుతున్నాయి వైసీపీ వర్గాలు.. ‘పోవయ్యా!! బూతు డైరెక్టరూ.. మొదట్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, తరువాత షోకాజ్ నోటీసులు పంపాక తిరిగి తోక ముడుచుకొని జగన్ అన్నకి క్షమాపణలు చెప్పాడు.. అతను ఎలా హీరో అవుతాడు.. క్యాస్ట్ ఫీలింగ్ లేదు అని ఇంత కులపిచ్చితో మాట్లాడుతున్నావు’, ‘ఇంకెందుకు ఆలస్యం సినిమా మొదలుపెట్టు మరి.. కాని ఒక్కమాట ‘సింహం సింగల్‌గా వస్తూంది కానీ సింగల్‌గా వచ్చిన ప్రతీది సింహం కాలేదు. గజ్జి కుక్క కూడా సింగిలే. ఎవరూ దగ్గరికి రానివ్వరు కాబట్టి అంత మాత్రాన అది సింహం అన్నట్టు కాదు’ అంటూ వర్మ పోస్ట్‌పై పంచ్‌లు వేస్తున్నారు నెటిజన్లు.
By July 01, 2020 at 09:07AM
No comments