రెండేళ్లు కాపురం చేసి... బిడ్డ పుట్టాక భార్యను వదిలించుకున్న భర్త
పెళ్లి చేసుకుని కొన్నాళ్లు కాపురం చేసి బాబు పుట్టాక వదిలేసిన భర్త నిర్వాకంపై భార్య ఆందోళన చేపట్టింది. తనను కాపురానికి తీసుకెళ్లాలంటూ అతడి ఇంటి ఎదుటే బైఠాయించింది. ఈ ఘటన జిల్లాలో జరిగింది. ఖమ్మం గ్రామీణ మండలం తెల్దారుపల్లి గ్రామానికి చెందిన కీర్తితో నగరంలోని సుగ్గలవారితోటకు చెందిన జాలాది నరేందర్‌కు 2016లో వివాహమైంది. వీరిద్దరూ కలిసి హైదరాబాద్‌లో కాపురముంటూ వేర్వేరు కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నారు. కొంతకాలానికి గర్భం దాల్చడంతో కీర్తి ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. Also Read: బాబు పుట్టిన 9 నెలల వరకు ఆమెను నరేందర్ కాపురానికి తీసుకెళ్లలేదు. దీంతో ఆమే స్వయంగా బిడ్డతో కలిసి అత్తింటికి వెళ్లగా అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించాడు. బాబును కూడా దగ్గరకు తీసుకోకపోవడంతో ఆమె తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. రెండున్నరేళ్లుగా పోలీసులు, పెద్దమనుషుల ద్వారా ఎన్నిసార్లు ప్రయత్నించినా నరేందర్‌లో మార్పు రాలేదు. Also Read: దీంతో విసిగిపోయిన ఆమె ఈ నెల 22న బిడ్డతో కలిసి భర్త ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది. భర్తతో పాటు అత్తమామలు ఇంటి గదికి తాళం వేసి వెళ్లిపోగా బాల్కనీలోనే బాబుతో కలిసి ఉంటూ ఆందోళన చేస్తోంది. తన భర్త కాపురానికి తీసుకెళ్లేవరకు ఆందోళన కొనసాగిస్తానని, ఈ విషయంలో తనకు పోలీసులు సాయం చేయాలని ఆమె వేడుకుంటోంది. Also Read:
By July 26, 2020 at 08:18AM
No comments