అస్సలు నమ్మొద్దు.. అదంతా ఫేక్! ఆ ఛాన్సే లేదంటూ క్లారిటీగా చెప్పేసిన అనసూయ
యాంకరింగ్ చేస్తూ కూడా అందాలతో ఆకట్టుకోవచ్చని నిరూపించింది జబర్దస్త్ బ్యూటీ . ఎప్పటికప్పుడు సరికొత్తగా మేకోవర్ అవుతూ బుల్లితెరపై ఆకర్షించే దుస్తుల్లో కనిపించే ఈ బ్యూటీ.. వెండితెరపై కూడా తన మార్క్ వేసుకుంది. 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్తగా నటించి సత్తా చాటింది. దీంతో ఆమెకు వరుస సినిమాలు తలుపుతట్టాయి. ఈ క్రమంలోనే ''F2, యాత్ర, కథనం, మీకు మాత్రమే చెబుతా'' సినిమాల్లో నటించి భేష్ అనిపించుకున్న అనసూయ.. రీసెంట్‌గా ఓ సినిమాలో హీరో తల్లి పాత్ర చేసేందుకు ఓకే చెప్పిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యంగ్ హీరో నటిస్తున్న కొత్త చిత్రంలో నటించనుందని, ముందుగా ఈ పాత్ర కోసం గతంలో ఇంద్రజను ఖరారు చేసినప్పటికీ.. ఇప్పుడు ఆమె స్థానాన్ని అనసూయ భర్తీ చేయనున్నారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం చెన్నైలో ఉన్న ఇంద్రజ కరోనా వైరస్ తాండవం చేస్తోన్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో హైదరాబాద్ రావడానికి నిరాకరించడంతో ఆమె స్థానంలో అనసూయను తీసుకున్నారని టాక్ నడుస్తోంది. అయితే తాజాగా ఈ వార్తలపై స్పందించిన అనసూయ అందులో ఏ మాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. Also Read: కరోనా మహమ్మారి కారణంగా టీవీ షూటింగులకే వెళ్లడం లేదు.. ఇక కొత్త సినిమాలు ఒప్పుకునే ఛాన్స్ ఎక్కడ ఉంది? అదంతా ఫేక్.. నమ్మకండి అని చెప్పేసింది జబర్దస్త్ బ్యూటీ. దీంతో తల్లి పాత్రలో అనసూయ కనిపించనుందనే వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది. కాగా ప్రస్తుతం అనసూయ మూడు భారీ ప్రాజెక్ట్స్‌లో భాగమయ్యింది. కృష్ణవంశీ రూపొందిస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాలో అనసూయ దేవదాసి రోల్ పోషిస్తోందని తెలిసింది. అలాగే సుకుమార్-బన్నీ కాంబోలో వస్తోన్న ‘పుష్ప’, చిరంజీవి- కొరటాల కాంబోలో రూపొందతున్న ‘ఆచార్య’లో నటిస్తోందట అనసూయ.
By July 25, 2020 at 10:25AM
No comments