Breaking News

భార్యను చంపి అడవిలో పడేసిన భర్త.. రెండు నెలల తర్వాత వీడిన మిస్టరీ


కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపేసి అడవిలో పడేసిన భర్త దారుణం రెండు నెలల క్రితం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా మండలం హన్మాజీపేట్‌కు చెందిన తాడేం సావిత్రికి(28), వర్ని మండలం జలాల్‌పూర్‌కు చెందిన బాలరాజ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటికే బాలరాజ్‌కు అప్పటికే మరో మహిళతో పెళ్లికాగా మనస్పర్థలతో విడిపోయాడు. దీంతో భర్తను వదిలేసి కుమారుడితో కలిసి ఉంటున్న సావిత్రిని రెండో పెళ్లి చేసుకున్నాడు. Also Read: వీరిద్దరికి ఓ కూతురు పుట్టింది. ఏడాది నుంచి సావిత్రి పవర్తన సరిగ్గా లేకపోవడంతో బాలరాజ్ మందలిస్తూ వస్తున్నాడు. దీంతో దంపతులిద్దరూ తరుచూ ఘర్షణ పడేవారు. ఈ నేపథ్యంలో సావిత్రి తన భర్త, మామ సాయిలుపై గ్రామంలో పంచాయతీ పెట్టింది. దీంతో తన పరువు తీసిన భార్యను చంపేయాలని బాలరాజ్ నిర్ణయించుకున్నాడు. రెండు నెలల క్రితం బీడీఆకు, మొర్రి పండ్ల కోసమని సావిత్రిని తీసుకొని బాలరాజ్, సాయిలు అడివిలోకి వెళ్లారు. అక్కడ ఇద్దరూ కలిసి ఆమె గొంతు నులిమి చంపేసి శవాన్ని అక్కడే వదిలేసి వచ్చారు. Also Read: వారం రోజుల తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ బాలరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినా ఆమె ఆచూకీ లభించలేదు. మరోవైపు బాలరాజ్ కదలికలపై నిఘా పెట్టిన పోలీసులకు అతడిపై అనుమానం వచ్చింది. దీంతో అతడిని స్టేషన్‌కు పిలిపించి విచారింగా తండ్రితో కలిసి సావిత్రిని తానే చంపినట్లు అంగీకరించాడు. దీంతో నిందితుడిని హత్యా స్థలానికి తీసుకెళ్లి మృతదేహాన్ని గుర్తించి హాస్పిటల్‌కు తరలించారు. Also Read:


By July 13, 2020 at 12:19PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-kills-wife-with-help-of-father-in-banswada-in-nizamabad-district/articleshow/76934832.cms

No comments