కోవిడ్ కొత్త హాట్‌స్పాట్స్‌గా హైదరబాద్, బెంగళూరు, పుణే
దేశంలోని తొమ్మిది ప్రధాన నగారాల్లో బెంగళూరు, హైదరాబాద్, పుణేల్లో ప్రస్తుతం మహమ్మారి అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ అత్యధికంగా కేసులు నమోదయిన ముంబయి, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్‌లో వైరస్ సంక్రమణ తగ్గుముఖం పట్టినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. బెంగళూరు నగరంలో పాజిటివ్ కేసులు గత నాలుగు వారాల్లోనే 12.9 శాతం మేర పెరిగాయి. ఇదే సమయంలో మరణాలు కూడా 8.9 శాతం పెరుగుదల నమోదయ్యింది. మెట్రో నగరాలలో కరోనా మరణాలకు వస్తే ముంబయి, కోల్‌కతా తర్వాతి స్థానంలో అహ్మదాబాద్ ఉంది. చెన్నైలో 10 లక్షల మందికి 8,595 కేసులు చొప్పున నమోదయ్యాయి. దీని తర్వాతి స్థానంలో ముంబయి, పుణే, ఢిల్లీ నగరాలు ఉన్నాయి. ఇక, ముంబయిలోని ప్రతి 10 లక్షల మంది జనాభాకు 345 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలోనే ఇదే అత్యధికంగా కాగా... తర్వాత అహ్మదాబాద్, ఢిల్లీ నిలిచాయి. గత నాలుగు వారాల గణాంకాలను విశ్లేషిస్తే కొత్త పట్టణ కేంద్రాలు, రాష్ట్రాలు, ఇతర ప్రాంతాలకు వైరస్ వ్యాపిస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. పాజిటివ్ కేసులలో రోజువారీ సగటు వృద్ధి రేటు ముంబైలో తగ్గుతుంటే..పుణేలో పెరుగుతోంది. అహ్మదాబాద్‌లో జాతీయ సగటు కంటే చాలా తక్కువ రేటు కేసులు నమోదవుతుంటే... సూరత్‌లో మాత్రం జాతీయ సగటును మించి నమోదవుతున్నాయి. చెన్నై నగరంలో మహమ్మారి మందగించినట్లు కనిపిస్తోంది, కానీ, హైదరాబాద్, బెంగళూరులలో ఉప్పెనలా ఉంది. కొత్తగా మరిన్ని నగరాలకు వైరస్ వ్యాపించడమే కాకుండా, కేసుల నమోదులోనూ మార్పులు ఉన్నాయి. ఉదాహరణకు.. దేశంలో అత్యధిక కేసులు నమోదయిన ముంబైలో వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. అయితే ముంబై మెట్రోపాలిటిన్ రీజియన్‌లోని థానే, కళ్యాణ్, నవీ ముంబై, భివాండి శాటిలైట్ టౌన్‌షిప్‌లలో పెరుగుదల ఉంది. ముంబై నగరంలో జూన్, జులై రెండు వారాల్లో రోజుకు సగటున 1,000-1,500 కేసులు నమోదవుతుంటే.. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, పట్టణాలలో వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో నివసించే వైద్య, ఆరోగ్య సిబ్బంది, నిత్యావసరాల కార్మికుల రాకపోకలు, అధికారుల సమిష్టి కృషి లేకపోవడం, బలమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ లేకపోవడంతోనే వైరస్ సంక్రమణ వేగంగా ఉంది. థానే, కళ్యాణ్, నవీ ముంబై మునిసిపల్ కార్పొరేషన్లలో ఇప్పటికే 10,000 కి పైగా కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి, ముంబై నగరంలో కంటే ప్రస్తుతం థానే, పుణే జిల్లాల్లో ఎక్కువ యాక్టివ్ కేసులున్నాయి.
By July 18, 2020 at 07:26AM
No comments