Breaking News

సినీ నటి రాధ ప్రశాంతి కేసు.. బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు


సినీ నమోదు అయ్యింది. హైదరాబాద బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు అందింది. రాధా ప్రశాంతి తనపై దురుసుగా ప్రవర్తించారంటూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిల్డింగ్ సెక్యూరిటీగా పని చేస్తున్న లక్ష్మీ అనే మహిళను రాధ ప్రశాంతి కారు ఢీ కొట్టింది. శబ్దం వినిపించడంతో స్థానికంగా ఉండే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఓ మహిల‌ బయటికి వచ్చారు. రాధ ప్రశాంతితో పాటు ఉన్న మరో వ్యక్తి ఆ మహిళపై దాడి చేయడం చూశారు. అయితే ఆ సమయలో అక్కడకు చేరుకున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దాడి దృశ్యాల్ని తన మొబైల్‌లో చిత్రీకరించారు. దీంతో సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మొబైల్ లాక్కొని ధ్వంసం చేశారు . తనతో అసభ్యకరంగా కూడా ప్రవర్తించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు. రాధ ప్రశాంతితో పాటు మరో వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు నటి రాధను ప్రశ్నించారా లేదా .. దీనికి సంబంధించి ఇంతవరకు ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా లేదా అన్న సమాచారం లేదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


By July 23, 2020 at 10:30AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/case-file-against-actress-radha-prasanthi-at-banjara-hills-police-station/articleshow/77120696.cms

No comments