బీజేపీలో చేరిన 24 గంటల్లోనే రాజకీయాల నుంచి తప్పుకున్న మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్!
బీజేపీలో చేరిన భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ ఆటగాడు 24 గంటలైనా తిరక్కముందే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన హొస్సేన్.. ఫుట్‌బాల్ క్రీడలో మిడ్‌ఫీల్డ్ జనరల్‌గా సుపరిచితుడు. రాజకీయాల్లోకి వచ్చి, తొలిసారి బీజేపీలో చేరిన ఆయన 24 గంటల్లోనే బయటకు రావడం చర్చనీయాంశమయ్యింది. అయితే, రాజకీయాల్లో చేరాలన్న తన ఆకస్మిక చర్యపై కుటుంబం, శ్రేయోభిలాషుల ఆందోళన వ్యక్తం చేయడంతో నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నానని హుస్సేన్ అన్నారు. తూర్పు బెంగాల్ ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ మెహతాబ్ హొస్సేన్.. రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో గురువారం ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే, కేవలం 24 గంటల్లోనే బీజేపీ నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు ప్రకటించారు. ‘తనకు ఈ రోజు నుంచి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు.. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను.. నా శ్రేయాభిలాషులను క్షమించాలని కోరుతున్నా’ అని ఫేస్‌బుక్ పేజ్‌లో హొస్సేన్ పేర్కొన్నారు. తనను ఎవరూ బలవంతం చేయలేదని, రాజకీయాలకు దూరంగా ఉండాలనేది వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. భారత్ తరఫున 30 మ్యాచ్‌లు ఆడిన హోస్సెస్.. ప్రజలకు సేవచేయడానికి రాజకీయాల్లో వచ్చినట్టు బీజేపీలో చేరిన రోజు వెల్లడించారు. ఈ ప్రయత్నంలో ప్రజలతో ఉండాలని కోరుకున్నాను..ప్రజలకు సహాయం చేయాని మేల్కొని.. హఠాత్తుగా రాజకీయాల్లో చేరాను’ అని అన్నారు. అయితే, తనను రాజకీయ నేతగా చూడటానికి ప్రజలు ఇష్టపడలేదు అని వ్యాఖ్యానించారు. 2018-19లో ఫుట్‌బాల్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన హోస్సేన్.. తన భార్య, పిల్లలకు సైతం రాజకీయాల్లో చేరడం ఇష్టంలేదన్నారు. అయితే, హూస్సేన్ బీజేపీ నుంచి వెళ్లిపోవడానికి తృణమూల్ కాంగ్రెస్ బెదిరింపులే కారణమని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ‘ఇది ముమ్మాటికీ బెదిరింపు రాజకీయాల ఫలితం. ఇలాంటివి మనం ఇంతకు ముందే చూశాం. కానీ ఇటువంటి బెదిరింపు రాజకీయాలతో మునిగితేలుతున్న టీఎంసీ ప్రజల మద్దతు కోల్పోతుంది’ అని బీజేపీ ప్రధాన కార్యదర్శి సైయాంత్సు బసు అన్నారు. ఇవి నిరాధారమైన ఆరోపణలని టీఎంసీ వీటిని తోసిపుచ్చింది.
By July 23, 2020 at 10:40AM
No comments