టాలీవుడ్‌లో కూడా ఉంది.. ఇండస్ట్రీపై ఇలియానా సంచలన వ్యాఖ్యలు.. ఇష్యూ వైరల్
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత సినీ ఇండీస్ట్రీలో నెపోటిజంపై వాదనలు తీవ్రమయ్యాయి. ఎందరో సినీ నటులు ఇండస్ట్రీలో బంధు ప్రీతి ఉందని, ఆ కారణంగా తమకు అవకాశాలు దక్కడం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ యాక్టర్స్ ఎక్కువగా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో గోవా బ్యూటీ టాలీవుడ్ లోనూ నెపోటిజం ఉందంటూ సంచలన కామెంట్స్ చేయడం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇలియానా.. టాలీవుడ్ మొత్తాన్ని నెపోటిజం నడిపిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేసింది. కొత్త నటీనటులను, బయటనుంచి వచ్చిన వాళ్ళను ఇక్కడ ఎదగనీయరని ఈ గోవా బ్యూటీ చెప్పడం జనాల్లో హాట్ ఇష్యూగా మారింది. దీంతో ఇలియానాపై ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'నిజంగానే టాలీవుడ్‌లో కొత్తవారిని ఎదగనీయకపోతే మరి నువ్వు ఎలా స్టార్ హీరోయిన్ అయ్యావు?' అని ప్రశ్నిస్తూ ఆమెపై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. Also Read: పలు సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకొని టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ పట్టేశాక బాలీవుడ్ బాట పట్టిన ఇల్లీ బేబీ అక్కడ కొన్ని సినిమాలు చేసి.. తిరిగి టాలీవుడ్ వంక చూస్తోంది. ఈ మేరకు ఇటీవలే రవితేజ సరసన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో నటించి అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఈ అమ్మడికి నాగార్జున సరసన నటించే మరో అవకాశం దక్కిందని తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా రాబోతున్న కొత్త సినిమాలో ఇలియానాకు ఛాన్స్ ఇచ్చారని టాక్. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్‌లో నెపోటిజం ఉందంటూ ఇలియానా కామెంట్ చేయడం ఎంతవరకు సబబో ఆమెకే తెలియాలి!.
By July 31, 2020 at 11:11AM
No comments