47 చోరీల్లో నిందితుడు... మహారాష్ట్ర నుంచి వచ్చి హైదరాబాద్‌లో చిక్కాడు
రోడ్లపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని గొలుసు చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అతడి నుంచి రెండు మంగళసూత్రాలు, ఓ సెల్‌ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నారు. సుమారు 47 చోరీల కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడి వివరాలను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. Also Read: మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన శంకర్‌రావు జల్సాలకు అలవాటు పడ్డాడు. దీంతో సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో దొంగగా మారాడు. పుణె నగరంలో 33 బంగారు గొలుసులు, 14 బైకులు దొంగిలించాడు. దీంతో హదాప్పార్ పోలీసులు రెండేళ్ల క్రితం అతడిని అరెస్ట్ చేసి ఎరవాడ సెంట్రల్ జైలుకు తరలించారు. 15 రోజుల క్రితం జైలు నుంచి విడుదలై హైదరాబాద్‌కు వచ్చాడు. 19వ తేదీన ఓ బైక్‌ను దొంగిలించి ఎస్సార్ నగర్, కాచిగూడ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి పలు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. Also Read: దీనిపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరా పుటేజీని పరిశీలించారు. నిందితుడి సమాచారాన్ని నగరంలోని అన్ని పోలీస్‌స్టేషన్లకు పంపించారు. గురువారం బైక్‌పై సంచరిస్తున్న శంకర్‌రావును ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలో 47 కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడిని తొలిసారి హైదరాబాద్‌లో అరెస్ట్ చేశామని అడిషనల్ డీసీపీ జి.చక్రవర్తి తెలిపారు. Also Read:
By July 31, 2020 at 10:44AM
No comments