పోలీసుల ఎన్‌కౌంటర్‌లో గ్యాంగస్టర్ వికాస్ దూబే హతం
ఉత్తర్‌ప్రదేశ్ గ్యాంగస్టర్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ వికాస్ దూబేను.. ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తుండగా ఎన్‌కౌంటర్‌లో కాల్చిచంపారు. ఎస్టీఎఫ్ దళాలు వికాస్‌ను యూపీలోని కాన్పూర్‌కి తరలిస్తుండగా.. మార్గమధ్యలో అతడిని తీసుకెళ్తోన్న కాన్వాయ్ బోల్తా పడింది. దీంతో, పోలీసుల కస్టడీ నుంచి వికాస్ దూబే తప్పించుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు కాల్చి చంపినట్టు పేర్కొన్నాయి. వికాస్ దూబేను తీసుకెళ్తోన్న వాహనం.. బారా వద్ద ఉదయం 7.00 గంటల ప్రాంతంలో బోల్తా పడింది. దీన్ని అవకాశం తీసుకుని తప్పించుకోవడానికి దూబే ప్రయత్నించగా.. పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దూబేను పోలీసులు హాస్పిటల్‌కు తరలించారని తెలుస్తోంది. అయితే, అప్పటికే అతడు చనిపోయినట్టు తెలుస్తోంది. హత్యలు, దోపీడీల్లో ఆరితేరిన వికాస్ దూబేను ఓ హత్య కేసులో అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపై తన అనుచరులతో దాడి చేయించిన ఘటనలో 8 మంది పోలీసులు మృతి చెందారు. వీరిలో ఓ డిప్యూటీ ఎస్పీ సైతం ఉన్నారు. కరుడగట్టిన రౌడీ షీటర్ వికాస్ దూబేను పట్టుకోడానికి బిక్రూ గ్రామంలో పోలీసుల బృందం అక్కడకు చేరుకోగా.. అతడి అనుచరులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో డిప్యూటీ ఎస్పీ సహా ఎనిమిది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 60 కేసుల్లో నిందితుడిగా ఉన్న వికాస్ దూబేను అరెస్ట్ చేయడానికి గురువారం రాత్రి పోలీసులు అక్కడకు చేరుకోగా.. అతడి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో అతడి అనుచరులు కాల్పులుకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. పోలీసులు వస్తున్న విషయాన్ని ముందుగానే తెలియడంతో.. వారిని ఏమార్చి రోడ్లను దిగ్బంధించారు. పోలీసులను బ ఎనిమిది పోలీసులను పొట్టనబెట్టుకున్న కరుడగట్టిన నేరస్థుడు వికాస్ దూబే మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో గురువారం ఉదయం పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే, మహాకాళేశ్వర ఆలయంలోకి వీఐపీ పాస్‌తో ప్రవేశించడానికి వికాస్ దూబే ప్రయత్నించాడు. ఆలయంలోకి వెళ్లడానికి ముందు ఓ షాప్ ముందు నిలబడి దేవుడ్ని ప్రార్ధిస్తుండగా గ్యాంగస్టర్‌ను గుర్తించిన దుకాణం యజమాని.. పక్కనే ఉన్న భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశాడు. దీంతో వెంటనే స్పందించిన సెక్యూరిటీ గార్డ్స్.. వికాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగడమే కాదు, వారిపై దాడికి ప్రయత్నించాడు. అయితే, అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులపై అరవగా.. ఓ కానిస్టేబుల్ అతడి చెంప చెళ్లుమనిపించాడు.
By July 10, 2020 at 07:55AM
No comments