అనుమానంతో భార్యను చంపి.. పశ్చాత్తాపంతో ఉరేసుకున్న భర్త
అక్రమ సంబంధం అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త పశ్చాత్తాపంతో రెండ్రోజులకే ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా మండలంలో జరిగింది. కలువరాయి గ్రామానికి చెందిన పిరిడి లక్ష్మణకు సుశీల(40) అనే మహిళతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. వీరిలో ఒకరు పాలిటెక్నిక్, మరొకరు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. లక్ష్మణ దూర ప్రాంతాలకు వెళ్లి బట్టల వ్యాపారం చేస్తుంటాడు. లాక్‌డౌన్ సమయం నుంచి ఇంటి దగ్గరే ఉంటుండటంతో భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. Also Read: దీనిపై పంచాయతీ పెద్దలు పలుమార్లు అతడిని హెచ్చరించారు. మరోవైపు తన వ్యాపారం దివాళా తీయడంతో లక్ష్మణ గ్రామంలోనే పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేపట్టాడు. మంగళవారం(జులై 14) భార్యతో కలిసి పొలం వద్దకు వెళ్లిన లక్ష్మణ ఆమెతో మరోసారి గొడవపడ్డాడు. ఆవేశంలో గెడ్డపారతో భార్యను పొడిచి పరారయ్యాడు. పక్క పొలంలోని కూలీలు ఆమెను బొబ్బిలి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయింది. Also Read: ఈ ఘటనపై బొబ్బిలి పోలీసులు కేసు నమోదు చేసుకుని లక్ష్మణ కోసం గాలింపు చేపట్టారు. భార్య చనిపోయిందని బుధవారం తెలుసుకున్న లక్ష్మణ గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం సాయంత్రం బావి దగ్గర చెప్పులు, దుస్తులను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని బావిలో నీటిని ఇంజిన్లతో తోడించి గురువారం ఉదయం మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండ్రోజుల వ్యవధిలో తల్లిదండ్రులిద్దరూ మరణించడంతో ఇద్దరు కుర్రాళ్లు అనాథలుగా మిగిలారు. Also Read:
By July 17, 2020 at 09:59AM
No comments