ఖమ్మంలో కామాంధుడు.. ఏడేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం
వృధ్యాప్యంలోనూ కామంతో రెచ్చిపోయిన ఓ వ్యక్తి మనవరాలి వయసుండే బాలికపై అత్యాచారానికి పాల్పడిన నీచపు ఘటన జిల్లాలో వెలుగుచూసింది. బోనకల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. శనివారం భార్యభర్తలు వ్యవసాయ పనులకు వెళ్లగా బాలిక(7) తమ్ముడితో కలిసి ఇంటి దగ్గరే ఆడుకొంటోంది. ఆమెపై కన్నేసిన పక్కింట్లో ఉండే బొల్లెపోగు వెంకటేశ్వర్లు(66) బాలికను పిలిచి ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఎంతసేపటికి అక్క తిరిగి రాకపోవడంతో తమ్ముడు లోపలికి వెళ్లాడు. Also Read: ఆ సమయంలో బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడటం చూసి బయటకు వచ్చి కేకలు పెట్టాడు. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు వెంకటేశ్వర్లును పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈలోగా ఇంటికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులు జరిగిన విషయం తెలుసుకుని షాకయ్యారు. వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన ఎస్ఐ కొండలరావు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Also Read:
By July 26, 2020 at 08:30AM
No comments