Breaking News

చీపురుతో కొట్టిన భార్య... అవమానం తట్టుకోలేక భర్త ఆత్మహత్య


భార్య చీపురుతో కట్టిందన్న అవమానాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమబెంగాల్‌లోని అలీపుర్‌దూర్‌లో శనివారం అర్ధరాత్రి జరిగింది. పట్టణంలోని ఓ ప్రాంతంలో సౌమిత్ర(45) అనే వ్యక్తి భార్య, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. కొద్దిరోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో భార్య చీపురుకట్టతో సౌమిత్రపై దాడి చేసింది. దీనికి ఆమె తల్లి కూడా వంత పాటింది. Also Read: దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సౌమిత్ర ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అలీపుర్‌దూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సౌమిత్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదని, విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. Also Read:


By July 26, 2020 at 10:59AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-commits-suicide-in-west-bangal-over-wife-thrash-him-with-broom/articleshow/77178365.cms

No comments