Breaking News

తొలి స్వదేశీ సోషల్ మీడియా యాప్‌ను ఆవిష్కరించిన వెంకయ్య


సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకున్న వేళ చైనాకు సరైన గుణపాఠం చెప్పాలని భారత్ సంకల్పించింది. ఇందులో భాగంగా చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీయ యాప్‌ల రూపకల్పన ఊపందుకుంది. తొలి దేశీయ సూపర్ యాప్‌‌ను ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం ఆవిష్కరించారు. ఎలిమెంట్స్ యాప్‌ను విర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించిన .. విదేశీ యాప్‌లకు దీటుగా నిలవాలని ఆకాంక్షించారు. ఇలాంటి దేశీయ యాప్‌లు మరిన్ని రావాలని ఆయన అన్నారు. గురు పౌర్ణమి రోజున యాప్‌ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని ఉప-రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ఆత్మ నిర్బర్ భారత్‌ కోసం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని, దీని ద్వారా గ్రామాలు, పట్టణాల మధ్య సమన్వయం ఏర్పడుతుందన్నారు. మేడిస్ ఇండియాపై అన్ని ప్రాంతాల్లోనూ చైతన్యం వచ్చిందని, దేశంలోని వనరులను వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ కూడా పాల్గొన్నారు. టిక్‌టాక్‌ను బ్యాన్ చేయడంతో చింగారి యాప్ ఇప్పటికే లక్షలాది మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. చింగారి యాప్ ఛత్తీస్‌గడ్ డెవలపర్ రూపొందించిన ఇండియన్ టిక్‌టాక్ వెర్షన్, ఇది ప్రస్తుతం డిజిటల్ మీడియా ప్రపంచంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఒరిస్సా, కర్ణాటక డెవలపర్లు కూడా ఈ యాప్‌తో సంబంధం కలిగి ఉన్నారని చింగారి చీఫ్ ఆఫ్ ప్రొడక్ట్ సుమిత్ ఘోష్ అన్నారు. ఈ యాప్‌ను ఇప్పటివరకు సుమారు 25 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. చింగారి యాప్‌ను గూగుల్ ప్లేలో 2018 లో విడుదల చేశారని, భారతీయ వినియోగదారుల అవసరాలు, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని తయారు చేసినట్లు ఘోష్ తెలిపారు.


By July 05, 2020 at 12:41PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indias-first-social-media-app-elyments-launched-by-vice-president-venkaiah-naidu/articleshow/76795193.cms

No comments