వైజాగ్‌లో మరో కిడ్నాప్.. ఫైనాన్స్ వ్యాపారిని నిలువునా దోచుకున్న దుండగులు
విశాఖ నగరంలో వరుస కిడ్నాప్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఆదివారం డాబా గార్డెన్ ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సురేష్ కిడ్నాప్ చేసిన దుండగులు ఆయన భార్యకు ఫోన్ చేసి ఏకంగా రూ.5కోట్లు డిమాండ్ చేశారు. ఈ ఘటన మరువకముందే ద్వారకానగర్‌లో ఫైనాన్స్ వ్యాపారిని దుండగులు కిడ్నాప్ చేశారు. అతడిపై హత్యాయత్నానికి పాల్పడి నగదు, బంగారు ఆభరణాలు దోచుకుని పరారయ్యారు. Also Read: కైలాసపురానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి లాలం అప్పలరాజు బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని లలితా జ్యూయలర్స్ ప్రాంతంలో నిల్చుని ఉన్నాడు. అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు అప్పలరాజును బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని బీచ్‌రోడ్డు మీదుగా సాగర్‌నగర్ వైపు తీసుకెళ్లారు. Also Read: అక్కడ ఓ నిర్మానుష్య ప్రాంతంలో కత్తులతో పొట్ట, మెడ భాగాలపై దాడి చేశారు. అతడి వద్దవున్న ఆరు తులాల బంగారు ఉంగరాలు, మెడలో చైనుతో పాటు రూ.1.25లక్షల నగదు దోచుకుని పరారయ్యారు. బాధితుడు ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని కేజీహెచ్‌కు తరలించారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ద్వారకా జోన్ ఎస్‌ఐ కాంతారావు తెలిపారు. Also Read:
By July 09, 2020 at 09:20AM
No comments