Breaking News

సైబర్ నేరగాళ్లకు విజయవాడ పోలీసులు షాక్.. కొట్టేసిన సొమ్ము గంటలోనే వెనక్కి


ఇటీవల కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. మనకు తెలియకుండానే తన బ్యాంక్ అకౌంట్లో సొమ్మును కేటుగాళ్లు నొక్కేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చాలా ఘటనల్లో ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు. సైబర్ నేరగాళ్లు ఎక్కడి నుంచి నేరాలకు పాల్పడుతున్నారన్నది కూడా కొన్ని సందర్భాల్లో తెలుసుకోవడం కష్టంగా మారుతోంది. ఇలాంటి ఘటనల్లో సొమ్ము తిరిగిరాదనుకుని కొందరు బాధితులు మౌనంగా ఉంటున్నారు. అయితే పోలీసులు అలాంటి బాధితులకు ఊరటనిచ్చేలా ప్రయత్నం చేసి విజయం సాధించారు. ఓ మహిళ అకౌంట్లో నుంచి సైబర్ నేరగాళ్లు కాజేసిన సొమ్మును గంట వ్యవధిలోనే తిరిగి ఆమె అకౌంట్లోకి వచ్చేలా చేసి కేటుగాళ్లకు దిమ్మతిరిగే షాకిచ్చారు. Also Read: విజయవాడ కొత్తపేటకు చెందిన ఓ మహిళ ఈ నెల 23న తన గూగుల్‌ పే ఖాతా నుంచి స్నేహితురాలికి రూ.5వేలు పంపించారు. డబ్బులు అకౌంట్ నుంచి కట్ అయినప్పటికీ ట్రాన్సాక్షన్ పూర్తి కాలేదని మెసేజ్ వచ్చింది. దీంతో తనకు తెలిసిన వారికి చెప్పగా ఒకట్రెండు రోజుల్లో డబ్బులు తిరిగి వచ్చేస్తాయని చెప్పారు. వారం రోజులైనా డబ్బులు తిరిగి రాకపోవడంతో ఆమె గూగుల్ పే కస్టమర్ కేర్ నంబర్ కోసం సెర్స్ చేసి ఆ నంబర్‌కు ఫోన్ చేశారు. అవతలి వ్యక్తి మాట్లాడుతూ సాంకేతిక కారణాలతోనే ఇలా జరిగిందని చెప్పి.. ఆమె బ్యాంక్ అకౌంట్ నంబర్, ఓటీపీ తెలుసుకున్నాడు. Also Read: కాసేపటికే ఆమె అకౌంట్ నుంచి రూ.48,761లు విత్‌డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో కంగారుపడిన బాధితురాలు మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు నగదు ఏ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అయిందో తెలుసుకున్నారు. బ్యాంక్ అధికారులను సంప్రదించి తిరిగి బాధితురాలి అకౌంట్ నగదు జమ అయ్యేలా చేశారు. కేవలం గంట సమయంలోనే ఈ వ్యవహారమంతా జరిగిపోయింది. తన సొమ్ము తిరిగొచ్చేలా చేసిన సైబర్‌ క్రైం పోలీసులు బాధితురాలు కృతజ్ఞతలు చెప్పింది. ఎత్తుకు పైఎత్తు వేసి సైబర్ నేరగాళ్లను చిత్తు చేసిన విజయవాడ పోలీసులను ప్రజలు అభినందిస్తున్నారు. Also Read:


By July 30, 2020 at 09:16AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/vijayawada-cyber-crime-police-gives-shock-to-cyber-criminal-theft-money-took-return-within-one-hour/articleshow/77253682.cms

No comments