బెంగాలీ అమ్మాయిలతో వ్యభిచారం.. హైదరాబాద్‌లో ముఠా అరెస్ట్
కరోనా సమయంలోనూ నగరంలో దందా యథేచ్చగా కొనసాగుతోంది. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆశతో కొందరు అక్రమార్కులు మహిళల శరీరాలతో వ్యాపారం చేస్తున్నారు. తాజాగా ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఎ..శివకుమార్, కరీంనగర్‌కు చెందిన చిన్నా స్నేహితులు. వీరికి పశ్చిమ బెంగాల్, ముంబయి, ఇతర రాష్ట్రాల్లో అమ్మాయిలను అక్రమంగా రవాణా చేసే ముఠాలతో పరిచయాలు ఉన్నాయి. Also Read: దీంతో సులభంగా డబ్బు సంపాదించాలనుకున్న వారిద్దరు వ్యభిచారం చేయించాలనుకున్నారు. ఉద్యోగాల పేరుతో బ్రోకర్ల సాయంతో ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి దిల్‌సుఖ్‌నగర్‌లోని ఇంట్లో ఉంచేవారు. అమ్మాయిల ఫోటోలను ఆన్‌లైన్లో పెట్టి విటులను ఆకర్షించేవారు. ఒక్కో కస్టమర్ నుంచి రూ. 5 వేల నుంచి 8 వేల వరకు వసూలు చేసి అమ్మాయిలను పంపించేవారు. ఈ వ్యభిచార దందాపై సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు నేరేడ్‌మెట్‌లోని వాయుపురి కాలనీలో జరుగుతున్న సెక్స్ రాకెట్‌పై దాడులు నిర్వహించారు. Also Read: ఈ సందర్భంగా నిర్వాహకుడు శివకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు యువతులను రక్షించారు. మరొక నిర్వాహకుడు చిన్నా పరారీలో ఉన్నాడు. శివకుమార్ నేరం అంగీకరించడంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:
By July 22, 2020 at 11:04AM
No comments