Breaking News

మూడు నెలల గర్భిణి ఆత్మహత్య.. కారణం తెలీక కుటుంబసభ్యుల షాక్


జిల్లా మండలం మోదవలస పంచాయతీ గొండయ్యపాలెంలో మౌనిక (21) అనే వివాహిత ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మౌనికకు గొండయ్యపాలేనికి చెందిన ఎర్నింటి గౌరయ్య అనే యువకుడితో రెండేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భవతి. అయితే ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకోగా.. గమనించిన మేనకోడలు కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో వారు మౌనికను రక్షించి విజయనగరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు ప్రాణాలు విడిచింది. Also Read: ఈ విషయం తెలుసుకున్న డెంకాడ ఎస్ఐ సాగర్‌బాబు సోమవారం కుటుంబసభ్యులను విచారించారు. అయితే దంపతుల మధ్య ఎలాంటి తగాదాలు లేవని, వారి కాపురం సజావుగానే సాగుతోందని వారు పోలీసులకు తెలిపారు. మౌనిక ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తమకు తెలియదని చెప్పారు. దీంతో పోలీసులు తహసీల్దారు చంద్రమౌళి సమక్షంలో సోమవారం శవపంచనామా నిర్వహించి మృతదేహానికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మంగళవారం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆత్మహత్య కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. Also Read:


By July 08, 2020 at 10:01AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/3-months-pregnant-woman-commits-suicide-in-vizianagaram-district/articleshow/76846887.cms

No comments