Breaking News

జుంబా డ్యాన్స్‌ పేరుతో అమ్మాయిలకు వేధింపులు.. ట్రైనర్ అరెస్ట్


పేరుతో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. చిరంజీవి అనే వ్యక్తి కొన్నాళ్ల క్రితం మాదాపూర్‌లో జుంబా డ్యాన్స్‌ పేరుతో ఓ అకాడమీని ప్రారంభించాడు. ఆ డ్యాన్స్ చేస్తూ బరువు తగ్గుతారని, ఆకర్షణీయమైన శరీరం సౌష్ఠవాన్ని సొంతం చేసుకోవచ్చంటూ భారీగా ప్రచారం చేయడంతో ధవవంతుల అమ్మాయిలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే యువతులు అందులో చేరారు. దీంతో అతడి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది. Also Read: తాను గచ్చిబౌలిలో మరో ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నానని, అందులో ఎవరైనా పెట్టుబడులు పెట్టొచ్చని చిరంజీవి చెప్పడంతో అనేక మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అతడికి రూ.లక్షల్లో డబ్బులిచ్చారు. అయితే బ్రాంచ్‌ ప్రారంభించకుండా ఆ డబ్బుతో చిరంజీవి జల్సాలు చేశాడు. ఎన్ని రోజులైనా కొత్త బ్రాంచి ప్రారంభం కాకపోవడంతో డబులిచ్చిన అమ్మాయిలు చిరంజీవిని నిలదీశారు. అతడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మోసపోయామని గ్రహించారు. Also Read: అతడి ఆగడాలపై చాలామంది బాధితులు సైబరాబాద్ షీ టీమ్ పోలీసులను ఆశ్రయించారు. చిరంజీవి డ్యాన్స్ పేరుతో అనేక మందిపై లైంగిక వేధింపులక పాల్పడేవాడని, తమ దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు చిరంజీవిని అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి డ్యాన్సుల వద్ద బరువు తగ్గుతారని, మంచి శరీర సౌష్ఠవం సొంతం చేసుకోవచ్చన్న ప్రచారంలో నిజం లేదని, ఇలాంటి ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. Also Read:


By July 17, 2020 at 11:37AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/zumba-dance-trainer-arrested-in-hyderabad-for-sexual-harassment-on-women/articleshow/77013302.cms

No comments