భారత్‌లో కరోనా కలకలం... సామాజిక వ్యాప్తి ప్రారంభం: ఐఎంఏ
భారత్‌లో కరోనా రోజురోజుకు పెరిగిపోతుంది. నిత్యం కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులు సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నమొన్నటి వరకు పెద్ద పెద్ద పట్టణాలకే మాత్రమే పరిమితమైన కేసుల సంఖ్య ఇప్పుడు గ్రామాలకు సైతం వ్యాపించింది. మారు మూల పల్లెల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జనాన్ని మరింత భయాందోళనలకు గురి చేస్తోంది. గత మూడు రోజుల్లో లక్ష చొప్పున నమోదవటం వెనుక ఉన్న కారణాన్ని భారతీయ వైద్య మండలి (ఐఎంఏ) వెల్లడించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తాజాగా చేసిన హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో సామాజిక వ్యాప్తి మొదలైందని, ప్రస్తుత పరిస్థితి ఏమాత్రం బాగాలేదని ఐఎంఏ హెచ్చరించింది. రోజుకు సగటున 30 వేల వరకు కేసులు నమోదవుతున్నాయని, ఇప్పుడు గ్రామాలకు కూడా కేసులు విస్తరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే మనదేశంలో కరోనా వైరస్ సామూహిక సంక్రమణ దశలోకి ప్రవేశించిందని ఐఎంఏ ప్రకటించింది. వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు రెండే మార్గాలు ఉన్నాయని పేర్కొంది. మొదటిది మొత్తం జనాభాలో 70 శాతం మందికి వైరస్ సోకితే సామూహిక వ్యాధి నిరోధక శక్తి వస్తుందని తెలిపింది. ఇక రెండోది టీకాల ద్వారా వ్యాధి నిరోధకత సాధించం. Read More: మరోవైపు, వచ్చే రెండు నెలల్లో కరోనా కేసులు పీక్‌స్టేజికి చేరుకోవచ్చని.. ఆ తర్వాత క్రమంగా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టవచ్చని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. అయితే, దేశంలో కరోనా యాక్టివ్ కేసుల కన్నా.. రికవరీల సంఖ్య రెట్టింపునకు చేరుకుందని కేంద్రం తెలిపింది. ఇదొక సానుకూల పరిణామం అని శనివారం వెల్లడించింది. దేశంలో రికవరీ రేటు 63 శాతంగా నమోదైందని కేంద్రం పేర్కొంది. మరోవైపు భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆరు లక్షలకుపైగా జనాభా మృత్యువాతపడ్డారు. తాజాగా 2,17,257 మందికి కరోనా సోకడంతో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 14,424,525కు చేరింది. గత 24 గంటల్లో 5008 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 6,04,880కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 86,11,976 మంది కోలుకోగా, మరో 52,07,669 మంది చికిత్స పొందుతున్నారు.
By July 19, 2020 at 09:17AM
No comments